Jallikattu: జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి.. ఎద్దు ఢీకొని యువకుడు మృతి.. మరో 10మందికి గాయాలు
తమిళనాడు లో సంక్రాంతి పండగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ 'జల్లికట్టు' లో పెను ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘జల్లికట్టు’ క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం జల్లికట్టులో ప్రధానాశం..
సంక్రాంతి పండగ అయినా ఇంకా తమిళనాడు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. వేలూరు జిల్లాల్లో జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో యువకులపై ఎద్దులు దూసుకెళ్లాయి. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఒకరు మృతి చెందారు.
తమిళనాడు లో సంక్రాంతి పండగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ లో పెను ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘జల్లికట్టు’ క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం జల్లికట్టులో ప్రధానాశం..
వేలూరు జిలాల్లో ఎద్దుల పందాలు పోటీలు జరుగుతున్నాయి. ఈ ‘జల్లికట్టు’ కార్యక్రమంలో ఎద్దు ప్రజలపైకి వచ్చి చాలా మందిని గాయపరిచింది. ఇందులో చాలా ఎద్దులు పాల్గొన్నాయి. జల్లి కట్టు పోటీలను చూడానికి వచ్చిన కొందరు యువకులపై ఎద్దులు దూసుకెళ్లాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. మరో 10 మందికి చికిత్స కొనసాగుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..