Trending Video: మేరా పతీ కహా గయా.. భర్త కోసం ఏడుపందుకున్న చిన్నారి.. సోషల్ మీడియోను కుదిపేస్తున్న క్యూట్ వీడియో..

పిల్లలకు సంబంధించిన వీడియోలు.. తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్నిసార్లు ప్రజలను భావోద్వేగానికి గురి చేస్తాయి. మరికొన్ని సార్లు నవ్విస్తాయి. ఇంకొన్ని సార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి...

Trending Video: మేరా పతీ కహా గయా.. భర్త కోసం ఏడుపందుకున్న చిన్నారి.. సోషల్ మీడియోను కుదిపేస్తున్న క్యూట్ వీడియో..
Child Funny Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 10, 2023 | 9:54 PM

పిల్లలకు సంబంధించిన వీడియోలు.. తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్నిసార్లు ప్రజలను భావోద్వేగానికి గురి చేస్తాయి. మరికొన్ని సార్లు నవ్విస్తాయి. ఇంకొన్ని సార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రెసెంట్ చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. రాత్రిపగలూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. పెద్దలు చిన్నపిల్లలు కూడా రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. తమలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటపెడుతున్నారు. ముఖ్యంగా ఫన్నీ ఇన్సిడెంట్స్ కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. అందులోనూ చిన్నారులకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే చూడకుండా ఉంటారా.. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి ఏడుస్తూ ఉండటాన్ని చూడవచ్చు. ఆమె వద్దకు ఓ మహిళ వెళ్లి.. ఎందుకు ఏడుస్తావ్ అని ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానంగా ఆ చిన్నారి నా భర్త ఎక్కడ అని క్యూట్ గా ఆన్సర్ ఇస్తుంది. ఆ సమాధానం విని ఆ మహిళ గొల్లున నవ్వేస్తుంది. ఆ తర్వాత నీ భర్త ఎవరు అని అడిగితే మామ అని చెబుతుంది. దీంతో షాక్ అయిన ఆ మహిళ.. మామ అత్తమ్మకు భర్త అవుతాడు. నీకు కాదు అని చెప్పగానే ఆ చిన్నారి మరింత గట్టిగా ఏడ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే.. నాకు భర్త కావాలి అని చెప్పడం షాక్ కు కలిగించడంతో పాటు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో చూస్తుంటే అచ్చం మన తెలుగులో ఫేమస్ అయిన పెళ్లి కావాలి అనే వీడియో గుర్తుకు రాక మానదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Patel K. (@creation_patelk)

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 4.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లక్షా 75 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండీ వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..