- Telugu News Photo Gallery India’s largest musical floating fountain launched in Hussain Sagar Lake Hyderabad
Hyderabad: హుస్సెన్ సాగర్‌లో మ్యూజికల్ ఫౌంటెయిన్.. ఎన్టీఆర్ మార్గ్‌లో ఆకర్షిస్తోన్న దేశంలోనే ఎత్తైన ఫౌంటెయిన్ అందాలు
హుస్సెన్ సాగర్ లో మ్యూజికల్ ఫౌంటెయిన్ హౌరా అనిపించింది. కళ్లు మిరమిట్లు గొలిపే లైటింగ్ అందాలు ప్రేక్షకుల మనస్సును ఆకట్టుకున్నాయి.
Updated on: Feb 10, 2023 | 2:05 PM

హుస్సెన్ సాగర్ లో మ్యూజికల్ ఫౌంటెయిన్ హౌరా అనిపించింది. కళ్లు మిరమిట్లు గొలిపే లైటింగ్ అందాలు ప్రేక్షకుల మనస్సును ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్ నగరం ఎన్నో పర్యాటక కేంద్రాలకు బిందువుగా నిలుస్తుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అభిరుచులకు తగ్గట్లుగా ఎంజాయ్ చేసేందుకు వివిధ రకాల పార్కులను, సంస్కృతిక కళా క్షేత్రాలను అభివృద్ధి చేస్తుంది రాష్ర్ట ప్రభుత్వం

ఈ క్రమంలోనే NTR మార్గ్ లో 17.2 కోట్ల రూపాయలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ప్రారంభించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.

దీంతో ట్యాంక్ బండ్‌కు సరికొత్త అందాలు జతకలిసాయి.

NTR మార్గ్ రోడ్ సైడ్ 180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో హుస్సేన్నాగర్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ కళ్లు మిరమిట్లు గోలిపేలా చేసింది.

. నైట్ టైమ్ లో తళుక్కుతళుక్కు మని మెరుస్తూ.. సందర్శకులకు ఆహ్లదకరమైన సంగీతాన్ని అందిస్తోంది. ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ను చేసేందుకు హుస్సేన్ సాగర్ కు పోటేత్తారు ప్రేక్షకులు.

హుస్సెన్ సాగర్ లో మ్యూజికల్ ఫౌంటెయిన్ హౌరా అనిపించింది. కళ్లు మిరమిట్లు గొలిపే లైటింగ్ అందాలు ప్రేక్షకుల మనస్సును ఆకట్టుకున్నాయి.

హుస్సెన్ సాగర్ లో మ్యూజికల్ ఫౌంటెయిన్

హుస్సెన్ సాగర్ లో మ్యూజికల్ ఫౌంటెయిన్

హుస్సెన్ సాగర్ లో మ్యూజికల్ ఫౌంటెయిన్