- Telugu News Photo Gallery Cinema photos Do you know about writer padmabhushan movie actress tina shilparaj biography telugu cinema news
Tina Shilparaj: ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో స్పెషల్ అట్రాక్షన్ అయిన టీనా శిల్పరాజ్ ఎవరో తెలుసా ?.. తెలుగుమ్మాయే..
తెలుగు చిత్రపరిశ్రమలోకి కొత్త అందాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇస్తోన్న ముద్దుగుమ్మలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఇండస్ట్రీలోకి అడుగులు వేయగా.. ఇప్పుడు మరో భామ కూడాఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
Updated on: Feb 10, 2023 | 1:50 PM

తెలుగు చిత్రపరిశ్రమలోకి కొత్త అందాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇస్తోన్న ముద్దుగుమ్మలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఇండస్ట్రీలోకి అడుగులు వేయగా.. ఇప్పుడు మరో భామ కూడాఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

టీనా శిల్పరాజ్.. ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది.

ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పించారు. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

టీనా తెలుగమ్మాయే. ఆమె స్వస్థలం హైదరాబాద్. రైటర్ పద్మభూషణ్ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చిందని.. అంతకు ముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీకి మేము కలిసి పనిచేశామని గతంలో ఇంటర్వ్యూలో తెలిపింది.

ఇందులో సారిక అనే పాత్రలో నటించింది. పద్మభూషణ్ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. డైరెక్టర్ ప్రశాంత్ ఈ అమ్మాయి పాత్రను అద్బుతంగా రాశారు.ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా టీనా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్మడుకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

రైటర్ పద్మభూషణ్ సినిమాతో స్పెషల్ అట్రాక్షన్ అయిన టీనా శిల్పరాజ్ ఎవరో తెలుసా ?.. తెలుగుమ్మాయే..

రైటర్ పద్మభూషణ్ సినిమాతో స్పెషల్ అట్రాక్షన్ అయిన టీనా శిల్పరాజ్ ఎవరో తెలుసా ?.. తెలుగుమ్మాయే..