AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన ప్రియుడు..? ఎక్కడంటే..

మహిళా పోలీసు కానిస్టేబుల్‌ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తుఉల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మృతి చెందారు..

Crime News: మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన ప్రియుడు..? ఎక్కడంటే..
Woman Constable Died
Srilakshmi C
|

Updated on: Feb 10, 2023 | 9:53 AM

Share

మహిళా పోలీసు కానిస్టేబుల్‌ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తుఉల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని కతిహార్ జిల్లా సమీపంలోని భట్వారా గ్రామంలో ప్రభకుమారి అనే మహిళా పోలీసు కానిస్టేబుల్‌ తన తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. ఈక్రమంలో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రభ కుమారి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా.. మోటర్‌ సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో బుల్లెట్‌ ప్రభ కుమారి తలకు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కతిహార్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు కతిహార్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ మీడియాకు తెలిపారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌ కోసం దర్యాప్తు చేపట్టినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. కాగా ప్రభ కుమారికి చోటు అలియాస్ అర్షద్‌ మధ్య లవ్‌ అఫైర్‌ ఉందని, గత కొన్ని రోజుల నుంచి చోటును ప్రభ దూరం పెట్టడంతో ఆమెను చంపేస్తానని ఫోన్‌లో అతడు పలుమార్లు బెదిరించినట్లు ప్రభ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదం కానిస్టుబుల్ ప్రాణాలు తీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా