Andhra Pradesh: వచ్చే నెలలోనే.. వైజాగ్‌కు షిఫ్ట్‌కానున్న సీఎం జగన్‌ అధికారిక నివాసం..?

రాష్ట్ర పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి వైజాగ్‌కు మార్చేందుకు అధికారులు ఇప్పటికే..

Andhra Pradesh: వచ్చే నెలలోనే.. వైజాగ్‌కు షిఫ్ట్‌కానున్న సీఎం జగన్‌ అధికారిక నివాసం..?
AP CM official residence
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 09, 2023 | 1:54 PM

రాష్ట్ర పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి వైజాగ్‌కు మార్చేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అధికారిక నివాస భవనంతో ఇతర భవనాల ఏర్పాటుకు విశాఖపట్నం జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఐతే రాష్ట్ర రాజధాని తరలింపుపై జిల్లా అధికారులకు ఇంకా అధికారిక ఉత్తర్వులు రానప్పటికీ, అధికారులు మాత్రం ముందస్తు గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు సమాచారం. దీంతో ఉత్తర్వులు ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశాఖలో ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని బీచ్ రోడ్డులో ఖరారు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే మార్చి 22 లేదా 23న ముఖ్యమంత్రి గృహప్రవేశం చేసే అవకాశం ఉందనే టాక్ జోరందుకుంది. అలాగే ఇతర అడ్మినిస్ట్రేసన్‌ బిల్డింగ్‌లను గుర్తించే పనిలో అధికార యంత్రంగం నిమగ్నమయ్యారు.

కాగా న్యూఢిల్లీలో జరిగిన సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం త్వరలో రాష్ట్ర రాజధాని అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో భాగంగా..’ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజధానిగా మారబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను కూడా త్వరలో విశాఖపట్నంకు షిఫ్ట్‌ అవుతానని’ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

2019లో జగన్‌ సర్కార్‌ మూడు రాజధానుల ఆలోచనను రూపొందించింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసనసభ రాజధానిగా ఉండబోతుందనే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఐతే రాజధాని తరలింపుపై 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన అమరావతి రైతుల నిరసనల దృష్ట్యా రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిని సవాళ్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయగా.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.