Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ రైళ్లు రైద్దు. పూర్తి వివరాలు..
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్టేషన్ల మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు,...
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్టేషన్ల మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అలాగే మరో రెండు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా రద్దు చేసిన రైళ్ల వివరాలు..
* 10-02-2023 తేదీన విజయవాడ-గుంటూరుల మధ్య ప్రయాణించే 07783 నెంబర్ రైలును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* 10-02-2023 తేదీన గుంటూరు-మాచర్లల మధ్య ప్రయాణించే 07779 నెంబర్ రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 09, 10 తేదీల్లో మాచర్ల నుంచి నదికుడే ప్రయాణించే 07580 నెంబర్ రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 09, 10 తేదీల్లో నదికుడే, మాచర్ల మధ్య ప్రయాణించే 075579 నెంబర్ రైలును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* ఫిబ్రవరి 09, 10 తేదీల్లో గుంటూరు – విజయవాడ మధ్య ప్రయాణించే 07788 నెంబర్ రైలును రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
* 10-02-2023 తేదీన కాచిగూడ – నదికుడేల మధ్య ప్రయణించే 07791 నెంబర్ రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 09, 10 తేదీల్లో నదికుడే – కాచిగూడల మధ్య నడిచే 07792 రైలును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* ఫిబ్రవరి 09, 10 తేదీల్లో విజయవాడ – బిట్రగుంటల మధ్య నడిచే 07978 రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 09,10 తేదీల్లో విజయవాడ – గూడురుల మధ్య ప్రయణించే 07500 రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 10, 11 తేదీల్లో గూడురు – విజయవాడల మధ్య నడిచే 07458 రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 10వ తేదీన కాకినాడ పోర్ట్ – విశాఖపట్నంల మధ్య నడిచే 17268 రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 10వ తేదీన విజయవాడ – ఒంగోలు మధ్య నడిచే 075576 నెంబర్ రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 09, 10 తేదీల్లో ఒంగోలు – విజయవాడల మధ్య నడిచే 07576 నెంబర్ రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 10వ తేదీన బిట్రగుంటా – చెన్నై సెంట్రల్ మధ్య నడిచే 17237 నెంబర్ రైలును రద్దు చేశారు.
* ఫిబ్రవరి 10వ తేదీన చెన్నై సెంట్రల్ – బిట్రగుంగా మధ్య నడిచే 17238 నెంబర్ రైలును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల వివరాలు..
* ఫిబ్రవరి 10వ తేదీన కాకినాడపోర్ట్ నుంచి విజయవాడ, కాకినాడ పోర్ట్ నుంచి రాజమండ్రీ నడిచే 17258 రైలును పాక్షికంగా రద్దు చేశారు.
* ఫిబ్రవరి 09, 10వ తేదీల్లో విజయవాడ – కాకినాడ పోర్ట్, రాజమండ్రి – కాకినాడ పోర్టుల మధ్య నడిచే 17257 నెంబర్ రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..