AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లిళ్ల సీజన్‌లో TSRTC బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలు చెక్ చేసుకోండి..

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాల కోసం అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ గురువారం ప్రకటించింది.

Telangana: పెళ్లిళ్ల సీజన్‌లో TSRTC బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలు చెక్ చేసుకోండి..
TSRTC
Shaik Madar Saheb
|

Updated on: Feb 09, 2023 | 1:46 PM

Share

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాల కోసం అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ గురువారం ప్రకటించింది. అన్ని రకాల బస్‌ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో డిమాండ్‌ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది.

శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. ప్రైవేట్‌ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని వారు పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు.

అద్దె బస్సుల బుకింగ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులకు వినియోగించుకుని టీఎస్‌ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?