ఆ పెంట్‌హౌస్‌ ఖరీదు అక్షరాల రూ.240 కోట్లు.. దేశంలోనే అత్యంత కాస్ట్లీ.. ఎక్కడంటే..?

దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను ప్రముఖ వ్యాపారవేత్త వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బీకే గోయెంకా రూ.240 కోట్లకు తాజాగా విక్రయించారు. వర్లీ లగ్జరీ టవర్‌లోని..

ఆ పెంట్‌హౌస్‌ ఖరీదు అక్షరాల రూ.240 కోట్లు.. దేశంలోనే అత్యంత కాస్ట్లీ.. ఎక్కడంటే..?
Worli Luxury Tower
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2023 | 3:31 PM

దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను ప్రముఖ వ్యాపారవేత్త వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బీకే గోయెంకా రూ.240 కోట్లకు సొంతం చేసుకున్నారు. ముంబైలోని వర్లీ లగ్జరీ టవర్‌లోని పెంట్‌హౌస్‌ను ఆయన కొనుగోలు చేసినట్లు మీడియాకు వెల్లడించాడు. టవర్ బిలో 63, 64, 65వ అంతస్తుల్లో ఈ పెంట్‌హౌస్‌ ఉంది. ఇది దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పెంట్‌హౌస్‌ను ముంబాయ్‌కి చెందిన బిల్డర్ వికాస్ ఒబెరాయ్ 24 కోట్ల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు బుధవారం (ఫిబ్రవరి 8) పూర్తయ్యాయి.

దేశ చరిత్రలో ఇప్పటి వరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదేనని రియల్ ఎస్టేట్ రేటింగ్, రీసెర్చ్ సంస్థ అయిన లియాసెస్ ఫోరస్ వ్యవస్థాపకుడు ఎంబీ పంకజ్ కపూర్ తెలిపారు. వచ్చే రెండు నెలల్లో మరిన్ని అల్ట్రా లక్స్ ఫ్లాట్ విక్రయాలు జరిగే అవకాశం ఉన్నట్లు పంకజ్ కపూర్ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెక్షన్ 54 కింద దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రూ.10 కోట్లకు కేంద్రం పరిమితం చేయాలని నిర్ణయించింది. ఒకవేళ మూలధన వ్యయం రూ. 10 కోట్లకు మించితే పన్ను చెల్లించవల్సి ఉంటుందని కపూర్ చెప్పారు. ఈ క్రమంలో ఖరీదైన అపార్ట్ మెంట్ల కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.