Air India : ఎయిరిండియా భారీ డీల్.. 250 కొత్త విమానాల కొనుగోలు కోసం అమెరికా సంస్థతో ఒప్పందం..
టాటా ఆధీనంలో ఉన్న ఎయిరిండియా...అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్బస్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.

టాటా ఆధీనంలో ఉన్న ఎయిరిండియా…అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్బస్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చేవారం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఈ ఒప్పందంపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా సుముఖత చూపలేదు. ఇప్పటికే మరో విమానాల తయారుదారు సంస్థ బోయింగ్ తోనూ సుమారు 200 విమానాల కొనుగోలు ఒప్పందంపై ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. టాటా ఆదీనంలోని ఎయిర్ ఇండియా తన విమానాల సర్వీసులను మరింతగా విస్తరించాలని భావిస్తున్నది.
ఈ మధ్యే ఎయిరిండియా చీఫ్ క్యాప్ బెల్ విల్సన్ మాట్లాడారు. కొత్త విమానాల కోసం తమ సంస్థ ఆర్డర్లను ఖరారు చేసినట్లు చెప్పారు. చివరిసారిగా ఎరిండియా 16ఏళ్ల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2005 వరకు ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8బిలియన్ డాలర్ల భారీ డీల్ ను కదుర్చుకుంది ఎయిరిండియా.
కాగా ఇప్పుడు ఎయిర్ బస్ 250విమానాల డీల్ లో భాగంగా A350 విమానాలు 40 ఉండే ఛాన్స్ ఉంది. ఈ విమానాలను నిర్వహించే మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిరిండియా చరిత్రలో నిలిపోనుంది. గతంలో ఎయిరిండియా A330విమానాలను నడిపింది. ఏవియేషన్ కన్సల్టేన్సీ CAPA ప్రకారం 2024నాటికి భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు 17వందల విమానాల కోసం ఆర్డర్లు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో 5వందల విమానాలను ఎయిర్ ఇండియానే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఒక్కటే 260కి పైగా విమానాలు నడుపుతోంది ఇండిగో కూడా ఈ మధ్యే భారత్ టర్కీ లీజ్ పై బీ 777 విమాన సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..