Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roof Plaza: రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా ఏర్పాటుపై ప్రధాని మోదీ విజన్‌.. మారనున్న ఇండియన్ రైల్వే ముఖచిత్రం..

రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా కాన్సెప్ట్‌పై ప్రధాని మోదీ దార్శనికత, వినూత్న ఆలోచనలను కేంద్ర రైల్వే శాక మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో..

Roof Plaza: రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా ఏర్పాటుపై ప్రధాని మోదీ విజన్‌.. మారనున్న ఇండియన్ రైల్వే ముఖచిత్రం..
Roof Plaza Concept
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 09, 2023 | 3:12 PM

రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా కాన్సెప్ట్‌పై ప్రధాని మోదీ దార్శనికత, వినూత్న ఆలోచనలను కేంద్ర రైల్వే శాక మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తక్షణ ప్రయోజనాలకంటే కొన్ని దశాబ్ధాల ముందు ఏ విధంగా ఉండాలనే దానిపై మోదీ ఆలోచిస్తారు. అందుకు రైల్వే స్టేషన్లను ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రాథమికంగా 50 రైల్వే స్టేషన్లలో రూఫ్‌ ప్లాజా ఏర్పాటు చేయాలని మాకు సూచించారు. మేము 50 స్టేషన్ల ప్లాన్‌లతో ఆయన వద్దకు వెళ్లాము. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ ప్రజెంటేషన్‌ ఇచ్చాం. ఐతే ప్రదాని మోదీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత మమ్మల్ని మళ్లీ పలిచి.. ఈ డిజైన్‌ ప్రస్తుతానికి సముచితంగా ఉంది. ఐతే 50 ఏళ్లకు ముందు ఉండే పరిస్థితులు గురించి మీరు ఆలోచించాలన్నారు.

ఆ తర్వాత అది ఏ విధంగా ఉండాలో ప్రధాని మాకు వివరించారు. ప్రతి రైల్వే స్టేషన్‌ ఆయా సిటీలకు సెంటర్‌లలో ఉంటాయి. అందుకు చాలా ప్రదేశం అవసరం అవుతుంది. బదులుగా మనం కొత్త అర్బస్‌ స్పేస్‌లను నిర్మించాలన్నారు. అప్పుడు మాకు రూఫ్‌ ప్లాజా కాన్పెప్ట్‌ గురించి వివరించారు. రైల్వే ట్రాక్‌పై రూఫ్‌ ప్లాజాలను నిర్మించవచ్చు. వీటినే కొత్త అర్బన్‌ స్పేస్‌ సెంటర్‌లుగా మార్చుకోవచ్చు. ప్రయాణికులు వేచి ఉండటానికి, లోకల్ ప్రొడక్ట్స్‌ అమ్మకాలు, ఆహార శాలలు, పిల్లలు ఆడుకోవడానికి ఆ ప్రదేశాలను వినియోగించుకోవచ్చన్నారు. ఒక వేళ ఆ స్టేషన్‌ తర్వాత కాలంలో విఫలమైతే ఈ అర్బన్‌ స్పేస్‌ నగరం రెండు భాగాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. రూఫ్‌ ప్లాజా అవుట్‌ టు అవుట్‌ కనెక్షన్‌ కలిగి ఉంటుంది. అప్పుడు రైల్వే స్టేషన్లు కేవలం ప్యాసెంజర్లకు మాత్రమేకాకుండా సిటీలోని పౌరులందరికీ ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ సునిశిత ఆలోచనలు భిన్నంగా, కొన్ని తరాలపాటు ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.