Ola S1 Air: ఓలా నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, మైలేజీ వివరాలు
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు కార్లు, టూవీలర్ వాహనాలు అందుబాటులోకి తీసుకురాగా, ఓలా మాత్రం మరింతగా దూసుకుపోతోంది. ఇప్పుడు ఓలా మరో ఈ-స్కూటర్‌ను తీసుకువచ్చింది. ఓలా ఎస్1 ఎయిర్ మోడల్ పేరును మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికేఈ 2కేడబ్ల్యూహెచ్, 3కేడబ్ల్యూహెచ్, 4కేడబ్ల్యూహెచ్ వేరియంట్లలో ఎస్1 ఎయిర్ స్కూటర్ వస్తుంది. న్యూ ఎస్1 ఎయిర్ స్కూటర్ ధర రూ.84,999 నుంచి రూ.1,09,999 మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇది ఒక్కసారి చార్జ్‌తో సుమారు 85-165 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 3 కొత్త వేరియంట్లలో లభించే ఎస్1 ఎయిర్ స్కూటర్ ఎక్కువ మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఆసక్తి చూపేలా పలు ధరల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్:
ఇక ఎస్1 స్కూటర్లలో సరికొత్తగా 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ తీసుకొచ్చింది కంపెనీ. ప్రతి రోజూ 20-30 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించే వారి వెసులుబాటు కోసం 2కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఆప్షన్ తీసుకొచ్చినట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. దీని ధర రూ.99,999 ఉంటుందని, ఇది సింగిల్ చార్జ్‌తో 91 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని తెలిపారు.
ఇప్పుడు మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఎస్1 ఎయిర్‌లో మూడు వేరియంట్లు, ఎస్1లో ఒక వేరియంట్ స్కూటర్ తీసుకువచ్చింది కంపెనీ. దీంతో ఎస్1, ఎస్1 ప్రోతో కలిపితే మొత్తం ఆరు స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో వచ్చాయి. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల స్కూటర్ ఎస్1 ఎయిర్ వేరియంట్ ధర రూ.84,999, అదే బ్యాటరీ సామర్థ్యం గల ఎస్1 స్కూటర్ ధర రూ.99,999గా ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది.
ఎస్1 స్కూటర్ వేరియంట్‌లో కొత్తగా తెచ్చిన 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల ఓలా ఎస్1 స్కూటర్ ఒక్కసారి చార్జి చేస్తే 91 కి.మీ. దూరం ప్రయాణం చేయవచ్చు. గంటకు 90 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి