Smartphone: మీరు స్మార్ట్ ఫోన్‌ను ఎలా పట్టుకుంటున్నారా.? దాని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌తోనే జీవితం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగించే సాధనం కానీ నేడు స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి...
మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌తోనే జీవితం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగించే సాధనం కానీ నేడు స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో అరచేతిలో అన్ని ప్రత్యక్షమవుతున్నాయి. ఇదిలా ఉంటే మనం స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకునే విధానం దర్వారా మన మనస్తత్వం ఎలాంటిది.? మనం ఎలా ఆలోచిస్తామన్న విషయాలను తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటంటే..
* మనలో కొందరు స్మార్ట్ ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకుని రెండు బొటన వేళ్లతో ఆపరేట్ చేస్తుంటారు. ఇలాంటి వారు సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారని చెబుతున్నారు. ఇలాంటి వారు ఛాలెంజ్‌లను స్వీకరించే మనస్తత్వంతో ఉంటారు.
* ఒక చేత్తో మొబైల్ పట్టుకుని మరో చేతి వేలితో స్క్రోల్ చేసే వారు చాలా ఆలోచనపరులని నిపుణులు చెబుతున్నారు. అయితే వీరు సిగ్గుపరులంటా. అందరిలో కలవడానికి పెద్దగా ఇష్టపడరు. చాలా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు. భాగస్వామిని గుర్తించడంలో తెలివితేటలు ప్రదర్శిస్తారటా.
* మనలో కొందరు ఒక చేత్తో పట్టుకొని అదే చేతి బొటనవేలుతో ఆపరేట్ చేస్తుంటారు అలాంటి వారు చాలా నమ్మకంగా ఉంటారు. కొత్త విషయాలను స్వీకరించడానికి భయపడరు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఛాలెంజ్ పనులు చేస్తుంటారు. జీవితం పట్ల ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారు జీవితంలో ఎలాంటి సందర్భాలు ఎదురైనా లైట్‌గా తీసుకుంటారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..