Chat GPT: చాట్ జీపీటీ ద్వారా ప్రేమ లేఖ… భారత్‌లో ఎంత మంది ఉపయోగించాలి అని అనుకుంటున్నారో తెలుసా?
ప్రస్తుతం చాట్‌జీపీటీ ద్వారా ప్రేమ లేఖ సరిపోతుంది కదా? అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇటీవల ఓ సంస్థ వెల్లడించిన సర్వే నివేదిక ప్రకారం భారత్‌లో ఏకంగా 62 శాతం చాట్‌జీపీటీ ద్వారా ప్రేమలేఖను రాయలనుకుంటున్నారని తేలింది.
చాట్‌జీపీటీ ఏఐ ఆధారిత సర్వీస్ ఇప్పుడు అందరూ దీని గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఈ సర్వీస్ గూగుల్‌కు పోటీ ఇస్తుందని నివేదికలు వెల్లడించడంతో అందరి దృష్టి చాట్‌జీపీటీ అందించే చాట్‌బాట్ సేవలపైనే పడింది. ప్రస్తుతం వ్యాలెంటైన్ వీక్ నడుస్తుంది. ముఖ్యంగా తమ ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మారిన టెక్నాలజీ ప్రకారం వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే చందంగా కొందరు కొత్తగా ప్రేమ లేఖ ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచాలని కోరుకుంటారు. అనుకున్నదే తడవుగా ప్రేమ లేఖ రాద్ధామన్నా సరైన పదాలు తెలియక తికమకపడుతుంటాం. అయితే ఈ ఇబ్బందులు ఎందుకు? ప్రస్తుతం చాట్‌జీపీటీ ఏఐ ద్వారా ప్రేమ లేఖ సరిపోతుంది కదా? అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇటీవల ఓ సంస్థ వెల్లడించిన సర్వే నివేదిక ప్రకారం భారత్‌లో ఏకంగా 62 శాతం చాట్‌జీపీటీ ద్వారా ప్రేమలేఖను రాయలనుకుంటున్నారని తేలింది. వీరిలో దాదాపు నమ్మకంగా రాయడానికి వాడతామని 59 శాతం మంది, సమయాభావం వల్ల 32 శాతం మంది రాస్తామని పేర్కొన్నారు. అయితే ఈ సర్వేలో 14 శాతం మంది మాత్రం వేగంగా సులభంగా రాయడానికి చాట్‌జీపీటీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
చాట్‌జీపీటీ ద్వారా ప్రేమలేఖ రాయడం ఇలా
- చాట్‌జీపీటీలో ప్రేమలేఖను రాయడానికి ముందుగా ఓపెన్ ఏఐలో ఖాతాను సృష్టించాలి.
- చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అనంతరం సైన్‌అప్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ సమయంలో వెబ్‌సైట్ లోడ్ అవ్వడానికి సమయం తీసుకుంటే కంగారు పడకుండా పేజీను రిఫ్రెష్ చేస్తూ ఉండాలి.
- అనంతరం డిస్‌ప్లే అయిన వివరాలను పొందుపరిచి మెయిల్ ఐడీ ఇవ్వాలి.
- అనంతరం మన మెయిల్‌కు వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది.
- ఆ లింక్‌ను క్లిక్ చేసి ధ్రువీకరించిన అనంతరం అందులో అడిగిన వివరాలన్నీ పొందుపర్చాలి.
- అప్పడు సైన్‌అప్ అయ్యి ఉచితంగా చాట్‌జీపీటీ సేవలను పొందవచ్చు.
- అక్కడ కనిపించే సెర్చ్ బార్‌లో మనకు కావాల్సిన అంశం ఇస్తే నిమిషాల్లో సమాధానం వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..