అదే పనిగా జిమ్ లో గంటల తరబడి చెమటలు కక్కుతున్నారా.. బీ అలర్ట్.. లేకుంటే ఈ సమస్యలు తప్పవు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి. కానీ అది వ్యసనంగా మారితే మాత్రం ఎంత ప్రమాదమో మాటల్లో చెప్పలేమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేపనిగా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో హానికరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధికంగా తినే రుగ్మతతో బాధపడుతున్నవారికి ఇది చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు...
Updated on: Feb 10, 2023 | 8:49 PM

వ్యాయామం చేయకుపోతే అపరాధన భావన లేదంటే ఆందోళన ఎక్కువౌతుంది. -అధిక వ్యాయామం అలవాటు చేసుకుంటే మీరు జీవితంలో ఇతర విషయాల కోసం సమయం వెచ్చించలేరు. -మీ సాధారణ షెడ్యూల్‌కు అంతరాయం కలిగిస్తుది. పనులన్నీ వాయిదా పడే అవకాశం ఉంటుంది.

వ్యాయామం అధికమైతే.. ఇతర విషయాలపై మనస్సు మళ్లించలేరు. శరీర గాయాలు ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వ్యాయామం చేయడం సరికాదు. వ్యాయామానికి అధిక సమయం కేటాయించడం వల్ల ఆఫీసు, పాఠశాల లేదా ఇతర కార్యక్రమాలకు హాజరుకాలేరు.

ఈ మధ్య చాలామంది జిమ్ లలో గంటలతరబడి వ్యాయామం చేస్తున్నారు. అయితే వ్యాయామం అనేది శరీరానికి ప్రయోజకరంగా ఉండాలి కానీ హానికలిగించే విధంగా ఉండకూడదు. గంటలపాటు వ్యాయామం చేస్తే శరీరం అలసిపోతుంది. స్టామినా తగ్గుతుంది. దీంతో అనేక రోగాలు బారిన పడాల్సి వస్తుంది.

ఇప్పటికే వ్యాయామాన్ని వ్యసనంగా అలవర్చుకున్నవారు దాన్ని నుంచి బయటపడేలా జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆ వ్యసనం నుంచి బయటపడాలంటే కేవలం వ్యాయామ సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. జీవసంబంధమైన, మానసిక,సామాజిక,ఆధ్యాత్మికపరమైన క్రమశిక్షణా విధానం చాలా అలవర్చుకోవాలి.

వ్యాయామం వ్యసనం నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. వ్యసనం నుంచి బయటపడాలని వంద శాతం నిబద్ధతతో నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. చికిత్స ప్రారంభంలో కాస్త కష్టంగా అనిపించినా కాలక్రమేణా అది అలవాటుగా మారుతుంది.



