AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar: చక్కెరతో చేటు.. పూర్తిగా తినడం మానేస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

శరీరానికి కొంత చక్కెర అవసరమే అయినప్పటికీ.. శుద్ధి చేసిన చక్కెర అనేక ఆరోగ్య రుగ్మతలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో అధిక క్యాలరీలు పెరగడానికి దోహదం చేస్తుంది.

Sugar: చక్కెరతో చేటు.. పూర్తిగా తినడం మానేస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?
Sugar
Madhu
| Edited By: |

Updated on: Feb 10, 2023 | 7:24 PM

Share

మనలో ఒక్కొక్కిరికీ ఒక్కోరకం టేస్ట్ ఉంటుంది. ఒకరు స్వీట్ ఇష్టపడతారు.. మరొకరు కారం ఇష్టడపతారు.. ఇంకొందరు పులుపు పదార్థాలపై మక్కువ చూపుతారు. వారికి ఇష్టమైన టేస్ట్ లోనే వారు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఒక్కో రకం ఆహార పదార్థాల్లో ఒక్కో రకం ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. కొన్ని ఆరోగ్యానికి మంచి చేస్తాయి.. మరికొన్ని చెడు చేస్తాయి. వీటిల్లో చక్కెర ప్రధానమైనది. చక్కెర కలిపిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యమా? అనారోగ్యమా? ఒక వేళ చక్కెర తినడం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు. ఏ సారి చూద్దాం..

చక్కెరతో చేటు..

చక్కెర మన ఆహారంలో అనేక రకాలుగా నిండి ఉంటుంది. అది డెజర్ట్‌లు కావచ్చు, పానీయాలు, కార్బోనేటేడ్ పానీయాలు లేదా పండ్లు కావచ్చు. అన్నింట్లోనూ చక్కెర ఉంటుంది. శరీరానికి కొంత చక్కెర అవసరమే అయినప్పటికీ.. శుద్ధి చేసిన చక్కెర అనేక ఆరోగ్య రుగ్మతలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో అధిక క్యాలరీలు పెరగడానికి దోహదం చేస్తుంది. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు రావడానికి కారణమవుతాయి. అంతేకాక ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుంది.

తినడం మానేస్తే ఏమవుతుంది..

మీరు చక్కెర తినడం మానేస్తే ఏమి జరుగుతుంది? దీనిపై చాలా మందికి అపోహలు ఉన్నాయి. చక్కెరను వినియోగించడం ఆపేస్తే శరీరానికి చెడు కన్నాన మేలే ఎక్కువ జరుగుతందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. మంచి కొవ్వులు శరీరంలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా ఆహారంలో ఎక్కువ చక్కెర కలిపినప్పుడు, గుండెను నియంత్రించే రక్త నాళాలు, నరాలు దెబ్బతింటాయి. అంటే, చక్కెర పూర్తిగా నివారించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. దంత క్షయానికి ప్రధాన కారణం చక్కెర. ఈ చక్కెర వినియోగం తగ్గినప్పుడు లేదా నివారించినప్పుడు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో చక్కెర అధికంగా ఉంటే, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే, మీరు ఆ చక్కెరను పూర్తిగా నివారించినప్పుడు, ఈ నష్టాలు తగ్గుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..