AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pizza Eating: 30 రోజులు కేవలం పిజ్జా మాత్రమే ఆహారం.. ఏమైందో తెలిస్తే షాకవుతారు

పుర్రెకో బుద్ధి అన్నట్టు ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ ఇటీవల ఓ కొత్త పని చేశాడు. 30 రోజుల పాటు కేవలం పిజ్జాను మాత్రమే ఆహారం తీసుకున్నాడు. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్, రాత్రి డిన్నర్ ఇలా ప్రతిసారి పిజ్జానే తీసుకున్నాడు.

Pizza Eating: 30 రోజులు కేవలం పిజ్జా మాత్రమే ఆహారం.. ఏమైందో తెలిస్తే షాకవుతారు
Pizza
Nikhil
|

Updated on: Feb 10, 2023 | 1:50 PM

Share

ప్రస్తుతం అంతా ఇష్టంగా తినే ఫుడ్ పిజ్జా. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా పిజ్జాను ఇష్టపడుతున్నారు. అయితే డైటింగ్ లో ఉన్న వారితో పాటు వ్యాయామాలు ఎక్కువ చేసి ఆహారం విషయం నియమాలు పాటించే వారు పిజ్జాకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే పుర్రెకో బుద్ధి అన్నట్టు ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ ఇటీవల ఓ కొత్త పని చేశాడు. 30 రోజుల పాటు కేవలం పిజ్జాను మాత్రమే ఆహారం తీసుకున్నాడు. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్, రాత్రి డిన్నర్ ఇలా ప్రతిసారి పిజ్జానే తీసుకున్నాడు. అతను ఇలా ఎందుకు చేశాడు? పిజ్జాను ఆహారం కింద తీసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో? ఓ సారి తెలుసుకుందాం.

ఐరిష్ దేశానికి చెందిన 34 ఏళ్ల ర్యాన్ 30 రోజుల పిజ్జా చాలెంజ్ ను స్వీకరించి కొత్త ప్రయోగం చేశాడు. దీని ద్వారా అతని శరీరంలో చెప్పుకోదగిన మార్పులేమి చోటు చేసుకోలేదని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సాధారణంగా పిజ్జాలు ఎక్కువ తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ అనూహ్యంగా ఇతడు 3.5 కేజీల బరువు తగ్గాడు. అయితే మీకు ఇతను ఇలా ఎందుకు చేశాడో? అనే అనుమానం రావచ్చు. డైటింగ్‌లో భాగంగా కడుపు కట్టుకుని తినాల్సిన అవసరం లేదని ఇష్టమైన ఆహారాన్ని కావాల్సినంత తిని కూడా బరువు తగ్గవచ్చని చెప్పాలని అనుకున్నాడు. అందుకే ఈ చాలెంజ్‌ను స్వీకరించాడు. అందువల్ల తనకిష్టమైన ఆహారం పిజ్జాను ఎంచుకున్నాడు. అయితే ఈ చాలెంజ్‌లో గమనించాల్సిన విషయం ఏంటంటే అతను కేవలం ఇంట్లో తయారు చేసిన పిజ్జాలను మాత్రమే తిన్నాడు. ర్యాన్ తన ఆహారంతో పాటు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తూ వర్క్‌అవుట్స్‌పై కూడా దృష్టి పెట్టాడు. అలాగే ఆహారం విషయంలో కూడా ఎప్పుడూ ఒకే రకమైన పిజ్జాలు తినకుండా అందులో వైవిద్యంగా ఉండేలా పిజ్జాలు తిన్నానని చెబుతున్నాడు. కానీ, మిగిలిన ఆహారం తినకుండా ఇష్టమైన పిజ్జాలు మాత్రమే తినడం ఆనందాన్ని కలిగించినా శరీరానికి కావాల్సిన క్యాలరీలను మేనేజ్ చేస్తూ తినడం కొంచెం ఇబ్బందిగా మారిందని మాత్రం చెప్పాడు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..