Andhra Pradesh: ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో హత్య చేసేందుకు తండ్రి యత్నం..

పిల్లలు తప్పుచేస్తే తండ్రి సరిదిద్దాల్సింది పోయి, ప్రాణాలు తీసేందుకు సిద్ధపడ్డాడు. ఫలితంగా కూతురిని చావుబతుకుల మధ్య పడేసాడు, అతను కుటుంబానికి కాకుండా పోయాడు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగింది.

Andhra Pradesh: ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో హత్య చేసేందుకు తండ్రి యత్నం..
Father And Daughter
Follow us
Surya Kala

|

Updated on: Feb 11, 2023 | 9:48 AM

అనుమానం పెనుభూతం అన్నారు. అలా కూతురిపై అనుమానం పెంచుకున్న ఓ తండ్రి వెనుకా ముందు ఆలోచించకుండా కూతురిపట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. అవును క్షణికావేశంలో జనాలు బంధాలను, మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన కూతురు ఫోన్‌ మాట్లాడుతుండగా ఎవరో కుర్రాడితో మాట్లాడుతుందని భావించి ఆమెను అమాంతం డాబాపైనుంచి కిందకి తోసేసాడు. పాపం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండగా అతను జైలుపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. యడ్లపాడు గ్రామానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని రెండు రోజుల క్రితం ఇంట్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తండ్రి ఆమెను మందలించాడు.

జిల్లాలోని గణపవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను కూరాకుల కావ్యగా గుర్తించినట్లు ఎడ్లపాడు ఎస్‌ఐ పి రాంబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కావ్య తన స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన కావ్య తండ్రి వర ప్రసాద్ (48) ఫోన్ చేస్తున్న కుమార్తెను గమనించాడు. ప్రసాద్ ఆమెను పరుష పదజాలంతో తిట్టాడు.. ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావని ఆమెను దారుణంగా కొట్టాడు. భయాందోళనకు గురైన బాలిక తన తండ్రి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఇంటి నుండి బయటకు పరుగులు తీసింది. దాంతో కావ్య తండ్రి వర ప్రసాద్ (48) కి కోపం కట్టలు తెంచుకుంది. ఆ అమ్మాయి ఎవరో అబ్బాయితోనే మాట్లాడుతుందని అనుమానించాడు. వెంటనే కుమార్తె గొంతుపట్టుకుని పైనుంచి కిందికి తోసేశాడు.

కావ్య తలపై, ఇతర శరీర భాగాలపై తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయింది. దీంతో బాలికను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..