Father's Funeral: అమానుషం.. తండ్రికి తలకొరివి పెట్టడానికి కొడుకు కండిషన్‌.. పాపం ఆ తల్లి కష్టం ఎవరికీ వొద్దు..

Father’s Funeral: అమానుషం.. తండ్రికి తలకొరివి పెట్టడానికి కొడుకు కండిషన్‌.. పాపం ఆ తల్లి కష్టం ఎవరికీ వొద్దు..

Anil kumar poka

|

Updated on: Feb 11, 2023 | 9:35 AM

ఎన్టీఆర్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తండ్రికి తలకొరివి పెట్టడానికి డబ్బు డిమాండ్ చేశాడు కుమారుడు.

ఎన్టీఆర్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తండ్రికి తలకొరివి పెట్టడానికి డబ్బు డిమాండ్ చేశాడు కుమారుడు. ఈ దారుణ ఘటన పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రులో వెలుగు చూసింది . అనిగండ్లపాడుకు చెందిన గింజుపల్లి కోటయ్య ఫిబ్రవరి 3 నాడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖర్మ చేసేందుకు తనయుడు రామారావు నిరాకరించాడు. ఆస్తి విషయంలో తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు రామారావు. దాంతో ఆరేళ్లుగా గుమ్మడిదుర్రులోని కూతురు వద్దే తలదాచుకుంటున్నారు వృద్ధ దంపతులు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా భీష్మించుకు కూర్చున్నాడు కొడుకు. గతంలో కోటయ్య ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బులు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తానని మొండికేశాడు. ఇక చేసేదేమీ లేక.. గుమ్మడిదుర్రులో కుమార్తె విజయలక్ష్మి తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. రామారావు తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు జనాలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 11, 2023 09:35 AM