Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీపీ చిత్రపఠానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగుడు .. సామాన్యుల పాలిట దేవుడంటూ ఆరాధిస్తూ జేజేలు

భూకబ్జాదారులకు వరంగల్ సిపి రంగనాథ్ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది.. అధికార పార్టీ నేతలని కూడా చూడకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు.. చివరకు పోలీస్ అధికారులైనా సరే నేరం చేస్తే కచ్చితంగా కటకటాల్లోకి వెళ్లాల్సిందే

Telangana: సీపీ చిత్రపఠానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగుడు .. సామాన్యుల పాలిట దేవుడంటూ ఆరాధిస్తూ జేజేలు
Warangal Cp Ranganath
Follow us
Surya Kala

|

Updated on: Feb 11, 2023 | 11:32 AM

సిటీకి ఎంతోమంది పోలీస్ కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఎవరో ఒకరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలిచి పోతారు.. నేరస్తుల పాలిట సింహస్వప్నమై బాధితులు గుండెల్లో దైవంలా నిలుస్తారు.. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కూడా అదే జరుగుతుంది.. అధికార-ప్రతిపక్ష పార్టీ నాయకులన్న తేడా లేదు.. భూ కబ్జాలకు పాల్పడితే మెడలుపట్టి కటకటాల్లోకి నెడుతున్నారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చర్యలతో కబ్జాదారుల చెరనుండి విముక్తిపొందిన బాధితుల సీపీ చిత్రపఠానికి పాలాభిషేకం చేశారు.. ఆయన సామాన్యుల పాలిటి దేవుడని ఆరాధిస్తూ జేజేలు పలుకుతున్నారు.

భూకబ్జాదారులకు వరంగల్ సిపి రంగనాథ్ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది.. అధికార పార్టీ నేతలని కూడా చూడకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు.. చివరకు పోలీస్ అధికారులైనా సరే నేరం చేస్తే కచ్చితంగా కటకటాల్లోకి వెళ్లాల్సిందే అని రుజువు చేసి చూపుతున్నారు. బాధితుల పక్షాన నిలిచిన సీపీ కి ఓరుగల్లు ప్రజలు జేజేలు పలుకుతున్నారు.. ఆయన చిత్ర పఠానికి పాలాభిషేకం చేస్తున్నారు.

వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన సయ్యద్ అసద్ అనే వికలాంగుడికి చెందిన ఇంటి స్థలాన్ని ఇదే ప్రాంతానికి చెందిన యాదగిరి అనే గల్లీ లీడర్ కబ్జా చేశాడు.. యాదగిరికి ఉన్న పలుకుబడితో అసద్ ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగలేదు. సుమారు 10 సంవత్సరాల నుండి అసద్ యాదగిరి పై పోరాడుతూనే ఉన్నాడు.. చివరకు నూతనంగా వచ్చిన వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ని కలిసి తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

విచారణకు ఆదేశించిన సిపి నకిలీ పత్రాలతో యాదగిరి ఈ వికలాంగుడి భూమిని కబ్జా చేశాడని నిర్ధారణకు వచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. దీంతో భావోద్వేగానికి గురైన బాధితులు సిపి కి వినూత్న రీతిలో కృతజ్ఞత తెలిపారు.. కాశిబుగ్గ జంక్షన్ లో బాధితుడి కుటుంబం మిత్రులతో కలిసి సిపి రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

గతంలో ఎంతోమంది పోలీసులకు పిర్యాదు చేశానని ఎవరూ పట్టించుకోలేదని.. సిపి రంగనాథ్ దయతో తన స్థలం తనకు వచ్చిందని తనకు సహాయం అందించిన సిపి కి కృతజ్ఞతలు తెలిపాడు.

Reporter: G.Peddeesh

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..