Cars Presents: నువ్వు దేవుడివి సామీ.. కంపెనీ స్థాపించి ఐదేళ్లు పూర్తి ఉద్యోగులకు గిఫ్ట్‌గా కార్లు పంపిణీ..

Cars Presents: నువ్వు దేవుడివి సామీ.. కంపెనీ స్థాపించి ఐదేళ్లు పూర్తి ఉద్యోగులకు గిఫ్ట్‌గా కార్లు పంపిణీ..

Anil kumar poka

|

Updated on: Feb 11, 2023 | 9:55 AM

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో కొట్టుమిట్టాడుతోంది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అన్న భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే వేలాది మందిని ఇంటికి సాగనంపాయి ఐటీ దిగ్గజ సంస్థలు. అయితే

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన తిధ్య టెక్‌ అనే ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. తమ సంస్థ లాభాల బాట పట్టేందుకు కృషి చేస్తున్న 13 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. ఈ కంపెనీ స్థాపించి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ విషయమై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ మరాంద్ మాట్లాడుతూ.. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచీ ఉద్యోగులు విశిష్ట సేవలందించారనీ, ఆ సేవలకు గాను వారికి కార్లు బహుమతిగా అందిస్తున్నామని తెలిపారు. సంస్థ నిర్మాణం కోసం ఉద్యోగులు తమ స్థిరమైన ఉద్యోగాలను వదులుకొని మరీ వచ్చారని తెలిపిన రమేష్‌.. కార్లను బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ కొనసాగిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే త్రిధ్య టెక్‌ కంపెనీ ఈకామర్స్, వెబ్ ,మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీకి ఆసియా, యూరప్ ఆస్ట్రేలియాలో క్లయింట్స్‌ ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 11, 2023 08:56 AM