AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టమాటా మిర్చి వేస్తే… కాసుల పంట పండింది

అర ఎకరం భూమిలో టమాటామిర్చి సాగు చేసిన ఆ రైతు మంచి ఆదాయం వచ్చినట్లు తెలిపాడు. తాను లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టినట్లు వివరించాడు.

Andhra Pradesh: టమాటా మిర్చి వేస్తే... కాసుల పంట పండింది
Tomato Mirchi Variety
Ram Naramaneni
|

Updated on: Feb 11, 2023 | 4:14 PM

Share

సరిగ్గా పంట పండి.. మంచి రేటు ఉంటే మిర్చి పంట కాసులు కురిపిస్తుంది. ఎకరానికి 2 నుంచి 3 లక్షల లాభం నికరంగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోయినా, ధరలు చిన్న చూపు చూసినా పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావు. అందుకే కాస్త ఎక్కువ లాభాలు అర్జించేందుకు రైతులు మిర్చిలోని కొత్త వంగడాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. టమాటా మిర్చి అనే పేరు ఈ మధ్య మార్కెట్‌లో బాగా వినిపిస్తుంది. దీని వాసన భలే బాగుంటుంది. కలర్ కూడా కాస్త డిఫరెంట్. ఇక రుచి విషయంలో కూడా తిరుగులేదని చెబుతున్నారు. దీని ప్రత్యేకతలు సోషల్ మీడియాలో చూసిన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామ రైతు తాటి శ్రీనివాసరావు అర ఎకరంలో ఈ టమాటా మిర్చిని సాగు చేశారు.

ఇప్పటికే 4 క్వింటాల మిర్చి పంట చేతికొచ్చింది. ఎటు తీసి.. ఎటు కూడిన మరో 4 క్వింటాళ్ల కాయ నమ్మకంగా వచ్చేలా ఉంది. అయితే దీని రేటు తెలిస్తే… మీరు స్టన్ అవ్వడం ఖాయం. ప్రజంట్ తెలంగాణ మార్కెట్‌లో టమాటా మిర్చి క్వింటా 90వేలకు పైచిలుకు పలుకుతుంది. ఈ లెక్కన అర ఎకరంలోని మొత్తం 8 క్వింటాల కాయకు 7 లక్షల వరకు వస్తుంది. కాగా ఈ అరెకరం సాగుకు రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టానట్లు సదరు రైతు తెలిపాడు. ఈ సీడ్ తనకు లాభదాయకంగానే ఉందని.. మిగిలిన ప్రాంతాల్లో నేలను బట్టి దిగుబడి ఉండొచ్చని సదరు రైతు వెల్లడించాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..