Vidadala Rajini: టాలీవుడ్‌లోకి ఏపీ మంత్రి విడదల రజిని ఎంట్రీ ఇవ్వనున్నారా? అసలు విషయమిదే..

అటు ఏపీ ప్రభుత్వంలోనూ, ఇటు వైసీపీ పార్టీలోనూ కీలక నాయకురాలిగా ఉన్న రజినీ గురించి సోషల్‌ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..  ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట.

Vidadala Rajini: టాలీవుడ్‌లోకి ఏపీ మంత్రి విడదల రజిని ఎంట్రీ ఇవ్వనున్నారా? అసలు విషయమిదే..
Vidadala Rajini
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2023 | 1:39 PM

విడదల రజినీ.. ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ డైనమిక్‌ పొలిటికల్‌ లీడర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపిస్తుంటారామె. అటు ఏపీ ప్రభుత్వంలోనూ, ఇటు వైసీపీ పార్టీలోనూ కీలక నాయకురాలిగా ఉన్న రజినీ గురించి సోషల్‌ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..  ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. నిర్మాణ రంగంలో తన అభిరుచిని చాటుకునేందుకు రజిని ప్రయత్నాలు ప్రారంభించారని, ఒక బ్యానర్‌ను మొదలెట్టే యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇందుకోసం హైదరాబాద్ లో ఒక ఆఫీసుని కూడా రెడీ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. టాలీవుడ్ లో  నిర్మాతగా రజిని ఎంట్రీ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు ఈ  వార్తల సారాంశం. త్వరలోనే సినిమా డైరెక్టర్‌, హీరో, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లను ఫైనలేజ్‌ చేసి అధికారికంగా ప్రకటించనున్నారట.

అసలు విషయమిదే..

అయితే దీనిపై టీవీ 9 ఆరాతీయగా.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలింది.  టాలీవుడ్ లో మంత్రి ఎంట్రీ ఇస్తున్నారన్నది కేవలం పుకార్లేనని స్పష్టమైంది. చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు విడద‌ల ర‌జిని. 2014లో తెలుగు దేశం పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారామె. అయితే ఆ తర్వాత జగన్‌ వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. 2019లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై మంత్రి వ‌ర్గ పునః వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..