AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రేమించి పెళ్లాడాడు.. ఏడేళ్ల తర్వాత భార్యను ఆన్‌లైన్‌లో బేరం పెట్టాడు.. చివరకు..

వారిద్దరి మతాలు వేరు.. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడు సంవత్సరాలపాటు ఈ దంపతుల కాపురం సజావుగా సాగింది.. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం పెరిగింది.

Andhra Pradesh: ప్రేమించి పెళ్లాడాడు.. ఏడేళ్ల తర్వాత భార్యను ఆన్‌లైన్‌లో బేరం పెట్టాడు.. చివరకు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Feb 11, 2023 | 11:59 AM

Share

వారిద్దరి మతాలు వేరు.. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడు సంవత్సరాలపాటు ఈ దంపతుల కాపురం సజావుగా సాగింది.. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం పెరిగింది. నిత్యం వేధింపులకు పాల్పడటమే కాకుండా.. ఆమె నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టాడు. భార్యతోపాటు ఆమె బంధువుల పసిగట్టడంతో పరారయ్యాడు.. అనంతరం వచ్చి.. ఆమెపై దాడి చేసి కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన షేక్‌ నాగుల్‌మీరా (బాజీ).. మొదటి భార్యతో విడిపోయి తన సోదరి ఊరైన రమణక్కపేటకు వచ్చి తాపీ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఈక్రమంలో గ్రామానికి చెందిన గొల్లపల్లి జ్యోత్స్న(29)తో పరిచయం ఏర్పడింది. 2015లో ఇద్దరూ ముస్లిం సంప్రదాయం ప్రకారం మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. బాజీ తాపీ పనికి వెళుతుండగా.. జ్యోత్స్న కూలి పనులకు వెళుతుంటుంది. ఏడాది క్రితం ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న బాజీ తరచూ గొడవపడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో నాగూల్‌ మీరా భార్య ఫోన్‌తో తిరువూరుకు వెళ్లాడు. అక్కడ ఆమె నగ్న చిత్రాలను సోషల్‌ మీడియాలో ఉంచి ఈ అమ్మాయి రేటు ఇంత అంటూ పోస్టు పెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లు రమణక్కపేటకు వచ్చి సెల్‌ఫోన్‌ను జ్యోత్స్న తల్లికి ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో జ్యోత్య్న ఫోన్‌కు చాలామంది గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో గత అక్టోబరులో బాధిత కుటుంబం ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న నాగుల్‌మీరా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.

ఇవి కూడా చదవండి

అయితే, జ్యోత్స్నపై అనుమానంతోపాటు కక్ష పెంచుకున్న నాగుల్‌ మీరా గరువారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి చెట్టు చాటున దాక్కున్నాడు. అనంతరం అటుగా వస్తున్న భార్యపై కత్తితో మూడు సార్లు పొడిచి పరారయ్యాడు. ఈ సమయంలో కుమారుడు చూసి బంధువులకు చెప్పాడు. వారు వచ్చేసరికే జ్యోత్స్న మరణించింది.

జ్యోత్స్న కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!