Harsha Sai: పవర్ స్టార్ పార్టీలోకి ఫేమస్ యూట్యూబర్.. జనసేనలోకి హర్షసాయి.?
పవన్ కళ్యాణ్ పార్టీలోకి పలువురు సినిమా నటులతో పాటు కొందరు ప్రముఖులు కూడా జాయిన్ అవుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కూడా జనసేన పార్టీలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలలోను చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా అధికార పక్షం పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.. ప్రజల సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేనను బలోపేతం చేసేందుకు.. త్వరలోనే ఆయన ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన వారాహి అనే వాహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం కోసం జనసేన సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీలోకి పలువురు సినిమా నటులతో పాటు.. కొందరు ప్రముఖులు కూడా జాయిన్ అవుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కూడా జనసేన పార్టీలో చేరనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
హర్షసాయి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పేదలకు సాయం చేస్తూ నెట్టింట మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంతోమంది సాయం అందిస్తూ తన ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. అయితే హర్షసాయి పోస్ట్ చేసే వీడియోలకు భారీ క్రేజ్ ఉంది. దాంతో తాను యూట్యూబ్ ద్వారా సంపాదించే డబ్బును ఎక్కువగా పేద ప్రజలకు సాయం చేసేందుకు ఉపయోగిస్తాడు.
అయితే ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నాడు అంటూ వస్తోన్న వార్తలపై ఇంతవరుకు హర్షసాయి స్పందించలేదు. దాంతో ఆయన జనసేనలో చేరడం ఖాయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రజలకు సేవ చేయాలని అనుకునే హర్షసాయి.. ప్రజలకోసం పోరాటం చేసే జనసేనలో చేరాలి అంటూ కొందరు అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం పై హర్షసాయి సైలెంట్ గా ఉండటంతో అతడు పవన్ పార్టీలో చేరడం ఖాయం అన్న వార్తలకు బలం చేకూరుతోంది. మరి త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.