Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari: తణుకులో మెడికల్ మాఫియా గుట్టురట్టు.. ఎక్సైపైరీ డేట్స్ చెరిపేసి సొమ్ము చేసుకుంటున్న మెడికల్ స్టోర్స్..

పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోయింది. డాక్టర్ ప్రిస్కిప్షన్‌ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా రాజ్యమేలుంది. ఎక్సైపైరీ అయిన మందులు డేట్ చెరిపేసి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కుల ఆటకట్టించారు.

West Godavari: తణుకులో మెడికల్ మాఫియా గుట్టురట్టు.. ఎక్సైపైరీ డేట్స్ చెరిపేసి సొమ్ము చేసుకుంటున్న మెడికల్ స్టోర్స్..
Medical Danda
Follow us
Surya Kala

|

Updated on: Feb 14, 2023 | 7:52 AM

వైద్యుల వద్దకు వెళ్తే.. ఫీజులు, పరీక్షలు అంటూ డబ్బులు భారీగా వసూలు చేస్తారని.. సామాన్యులు, మధ్యతరగతి వారు దగ్గు, జ్వరం, వంటి సాధారణ రోగాలకు మెడికల్ షాప్స్ దగ్గరకు వెళ్లి.. వారిచ్చిన మందులను తెచ్చుకుని వాడుతారు. అంతేకాదు బ్రాండెడ్‌ పేరిట నాసిరకం మందులను రోగులకు అంటగడుతూ అడ్డగోలుగా దోచుకునే మెడికల్ షాప్స్ కూడా అనేకం ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని ధనార్జనే ధ్యేయంగా మెడికల్‌ షాపులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న మెడికల్ మాఫియా గుట్టురట్టయింది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని తణుకులో మెడికల్ మాఫియా గుట్టురట్టైంది. డాక్టర్ ప్రిస్కిప్షన్‌ లేకుండా మెడికల్ షాప్‌ల యజమానులు చేస్తున్న మెడికల్ దందాను అడ్డుకున్నారు జిల్లా అధికారులు. ఎక్సైపైరీ అయిన మందులు డేట్ చెరిపేసి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కుల ఆటకట్టించారు. కొంత కాలంగా జిల్లాలో చాప క్రింద నీరులా సాగుతున్న మందుల చీకటి వ్యాపారం జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల దాడులతో తీగ లాగితే డొంక కదిలింది. తణుకు లోని వెంకటసాయి మెడికల్ స్టోర్ లో నిషేధిత మందు లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేసారు. జిల్లాలోని ఐదు మెడికల్ షాపులు, గోడౌన్ లపై దాడులు చేసి 25లక్షల విలువ చేసే నిషేధిత మందులను సీజ్ చేశారు అధికారులు. మత్తు కోసం వినియోగించే ఆల్ఫ్రాజోలం, సెక్స్ సామర్థ్యం పెంచే వయాగ్రా, గర్భవిచ్చిత్తి కోసం వాడే అబార్షన్ కిట్లు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొని.. పీఎంపీలు, ఆర్ఎంపి లకు విక్రయిస్తున్న ట్లుగా విచారణలో వెళ్ళ డైంది.

పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ మందులపై ఉన్న ఎంఆర్పీలను శాటిటైజర్ లో తుడిపేసి అధిక ధరలకు.. హోల్ సేల్ రిటెయిల్స్ షాపులకు సరఫరా చేస్తు న్న ట్లు గుర్తించారు. తక్కు వ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు అక్రమార్కులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని గుర్తించారు. మెడికల్ షాప్ యజమానులు విజయవాడ, హైదరాబాద్, బెం గళూ రు ప్రాంతాల్లోని మెడికల్ రిప్రజెంటేటివులు ద్వా రా వీటిని దిగుమతి చేసుకొని ఏజెంట్ల ద్వారా దందా సాగుతుందని తెలుసుకున్నారు అధికారులు. ఏకకాలంలో జిల్లాలోని తణుకు, ఏలూరు, భీమవరంలోని మెడికల్ షాపులపై దాడులు చేసి 9 కేసులు నమోదు చేశారు. మెడికల్ దందాపై ఆరా తీస్తు న్నామని చెప్పారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..