Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulwama Attack Anniversary: పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులైన రోజు.. మిమ్మల్ని, మీ త్యాగాన్ని మరచిపోమంటూ నివాళులు

జమ్మూకాశ్మీర్ లో పుల్వామా దాడి తో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఒకే సారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది.  భరతమాత ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకున్నారు. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్‌ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. 

Pulwama Attack Anniversary: పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులైన రోజు.. మిమ్మల్ని, మీ  త్యాగాన్ని మరచిపోమంటూ నివాళులు
Pulwama Attack 4 Year Anniv
Follow us
Surya Kala

|

Updated on: Feb 14, 2023 | 7:19 AM

భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచిన రోజు 2019 ఫిబ్రవరి 14, తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి భరతమాత రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ఒక ఆత్మాహుతి దాడి చేసిన పనికి 40 మంది జవాన్లు అమరులైన రోజు.. అవును జమ్మూకాశ్మీర్ లో పుల్వామా దాడి తో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఒకే సారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది.  భరతమాత ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకున్నారు. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్‌ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.

పుల్వామా దాడి జరిగి నాలుగేళ్లు

ప్రతి సంవత్సరం.. ఈ దాడిని ఖండిస్తూ.. పుల్వామా దాడి ఘటన మన దేశానికి ఒక చీకటి రోజు అంటూ అమరవీరులకు నేడు నివాళులు అర్పిస్తోంది. పాకిస్తాన్నీ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన అమర జవాన్ల సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవరని..  ఇదే  వీర సైనికుల సేవలను స్మరించుకుంటూ.. దేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాలుగేళ్ళ క్రితం 40 ఇళ్లలోని కుటుంబ సభ్యులు విలపించిన రోజు.. దేశ ప్రజల కళ్లలో ఆగ్రహావేశాలతో నిండిన రోజు, ప్రతి భారతీయుడు ఒక సైనికుడి కుటుంబ సభ్యుడిలా మారి విలపించిన రోజు పుల్వామా దాడి జరిగిన రోజు.. నేటికీ ప్రజల మనస్సులో అప్పటి సంఘటనలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. క్రూరమైన దాడిని ఖండిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలుపుతూనే ఉన్నారు. కాలిపోయిన మృతదేహాలు, కాలిపోయిన ట్రక్కులు, మారణహోమం జరిగిన ప్రాంతం..  హృదయాన్ని కదిలించే దృశ్యాలు అన్ని వార్తలలో నిలిచాయి.

తామే పుల్వామా దాడి చేసినట్లు.. దాడికి బాధ్యత వహిస్తూ జైషే మహ్మద్‌ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద 22 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో జవాన్ల  కాన్వాయ్‌లపై దాడి చేశాడు. ఈ యువకుడు కాశ్మీర్ నివాసి.. తమ కుమారుడు 2018 లో అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

2019 పుల్వామా దాడి తర్వాత ఏం జరిగిందంటే..  ఫిబ్రవరి 15, 2019న, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడికి పాకిస్తాన్‌ వేదికగానే జరిగినట్లు ఆరోపణలు చేసింది, అయితే పాకిస్తాన్ ఈ  ఆరోపణలన్నింటినీ ఖండించింది. భారత ప్రభుత్వం… వరుస సమావేశాల తర్వాత.. పాకిస్తాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. జవాన్ల మరణానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. ప్రతీకార జ్వాలల్లో ఊగిపోయింది. అమరవీరుల కుటుంబాలకు రూ.12 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం.

పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీని కూడా భారత్ 200 శాతానికి పెంచింది. అంతేకాకుండా, మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) పాకిస్తాన్‌ను ‘బ్లాక్‌లిస్ట్’లో చేర్చాలని భారతదేశం కూడా కోరింది. దీంతో పాక్ FATF లో ‘గ్రే లిస్ట్’లోకి చేరుకుంది. ఫిబ్రవరి 18, 2019 తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలు ఆంక్షలు విధించారు.

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్

తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 2019 న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ దళాలు తెలిపాయి. ప్రతీకారంగా, పాకిస్తాన్ కూడా మరుసటి రోజు వైమానిక దాడులను ప్రారంభించింది..  ఆ సమయంలో MIG-21 ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ కి చెందిన PAF  F-16ని కూల్చివేశాడు. ఈ సమయంలో వింగ్ కమాండర్ వర్థమాన్ పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యాడు. అభినందన్ ను పాకిస్తాన్ సైన్యం స్వాధీనంలోకి తీసుకుంది. మార్చి 1, 2019 రాత్రి విడుదల చేయబడ్డాడు. అభినందన్ వర్థమాన్  చూపిన ధైర్య సాహసాలకు గాను దేశంలోని మూడో అత్యున్నత శౌర్య పురస్కారం వీర్ చక్రను ప్రదానం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..