Termites Destroy Currency: బ్యాంక్ లాకర్‌లో దాచుకున్న సొమ్ముకు చెదలు.. లబోదిబో మంటున్న కస్టమర్స్.. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు

లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు పట్టాయి. దాందో కస్టమర్‌ లబోదిబోమన్నారు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలంటూ బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లో జరిగింది.

Termites Destroy Currency: బ్యాంక్ లాకర్‌లో దాచుకున్న సొమ్ముకు చెదలు.. లబోదిబో మంటున్న కస్టమర్స్.. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు
Termites Destroy Currency
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2023 | 1:25 PM

తమ దగ్గర కంటే.. బ్యాంక్ ల్లో తమ కష్టార్జితాన్ని దాచుకుంటే పదిలం అనుకున్నారు. అందుకే తాము ఎంతో కష్టపడి కూడబెట్టిన  డబ్బులను బ్యాంక్ లాకర్ లో పెట్టారు. అయితే వాటికీ చెదలు పట్టాయి. రెండు లక్షలకు పైగా విలువైన నోట్లకు చెదలు పట్టేశాయి. దీంతో  ఆ బ్యాంక్ కస్టమర్స్ ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. తాము దాచుకున్న సొమ్ముకు ఇప్పుడు చెదలు పట్టడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విచిత్ర ఘటన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటుచేసుకుంది. లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు పట్టాయి. దాందో కస్టమర్‌ లబోదిబోమన్నారు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలంటూ బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లో జరిగింది. కాలాజీ గోరాజీలోని పీఎన్‌బీ బ్రాంచ్‌లో సునీత మెహతా అనే మహిళ సుమారు 2 లక్షల వరకూ నగదు దాచుకున్నారు. ఇటీవల డబ్బు అవసరమై ఓ రోజు ఆమె లాకర్‌లోని డబ్బును ఇంటికి తెచ్చుకున్నారు.

ఈక్రమంలో డబ్బు ప్యాకెట్‌ను తెరిచి చూస్తే కొన్ని కరెన్సీ నోట్లు పొడిపొడిగా అయిపోయి కనిపించాయి. చెదలు పట్టడంతో నోట్లు నాశనమయ్యాయని గుర్తించిన ఆమె బిత్తరపోయింది. దాదాపు 15 వేల రూపాయల వరకూ నోట్లన్నీ పూర్తిగా చెదలు తినేసాయి. మరికొన్ని నోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే ఆ నగదు తీసుకొని బ్యాంకుకు వెళ్లిన ఆమె సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం తన డబ్బు వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజ‌రుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో..బాధితురాలు నష్టపోయిన మొత్తాన్ని బ్యాంకు అప్పటికప్పుడు తిరిగిచ్చేసింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బ్యాంకు అధికారులు కూడా ఈ పరిణామంతో షాకైపోయారట. లాకర్‌లో దాచిన కరెన్సీ నోట్లలో చాలావరకు చెదలుపట్టి నిరుపయోగంగా మారినట్టు గుర్తించి నివ్వెరపోయారు. స్థానికంగా ఈ వార్త కలకలం రేపడంతో కస్టమర్లు బ్యాంకుకు పోటెత్తారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెదల నివారణ కోసం బ్యాంకు పటిష్ఠ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..