Chanakya Niti: ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో స్నేహం, శత్రుత్వం వద్దంటున్న చాణక్య..

నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నాడు. చాణక్య విధానం ప్రకారం మోసపూరిత వ్యక్తులను నివారించాలనుకుంటే లేదా గుర్తించాలనుకుంటే  ఈ విధానాలను అనుసరించాలి.

Chanakya Niti: ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో స్నేహం, శత్రుత్వం వద్దంటున్న చాణక్య..
Chanakya Neeti
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2023 | 11:55 AM

ఆచార్య చాణక్యుడి సూక్తులు నేటికి అనుసరణీయం. అప్పటి కాలంలో చెప్పినా నేటి ఆధునిక కాలంలో కూడా మనిషి జీవన విధానానికి అనుసరనీయంగా నిలుస్తున్నాయి. చాణక్యుడు చెప్పిన మాటలు అతని చాణక్య నీతి పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి . ఈ విధానాలను చదవడం ద్వారా అనేక విషయాలను నేర్చుకుంటాము. తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నాడు. చాణక్య విధానం ప్రకారం మోసపూరిత వ్యక్తులను నివారించాలనుకుంటే లేదా గుర్తించాలనుకుంటే  ఈ విధానాలను అనుసరించాలి.

  1. మనిషి విజయం సాధించేందుకు, శత్రువులపై విజయం సాధించేందుకు, అడ్డంకులను పరిష్కరించడానికి చాణక్య నీతిలో అనేక విధానాలు పేర్కొనబడ్డాయి. ఎవరైతే ఈ విధానాలను అనుసరిస్తారో వారు ఏ విషయంలోనైనా విజయాన్ని పొందుతారు. ఈ విధానాలలో, మోసపూరిత, స్వార్థపరుల గురించి కూడా చాణక్యుడు ప్రస్తావించాడు. కాబట్టి చాణక్యుడి ప్రకారం అలాంటి వారిని ఎలా గుర్తించాలో.. వారి నుంచి ఎలా దూరంగా ఉండాలో పేర్కొన్నాడు. అవి ఏమిటో తెలుసుకుందాం..
  2. ఏదైనా పని చేసి సమయంలో తరచుగా సాకులు చెప్పే వ్యక్తులు. అంతేకాదు కొంతమంది వ్యక్తులు తమ స్వంత పని పూర్తయిన తర్వాత ఇతరులను విస్మరించడం ప్రారంభిస్తారు. అలాంటి వారి నుండి మీరు ఎలాంటి సహాయం ఆశించినట్లయితే, మీరు ఎల్లప్పుడూ నిరాశ చెందుతారు. అలాంటి వారి నుండి దూరం ఉంచడానికి ప్రయత్నించండి.
  3. మీ కష్ట సమయాల్లో మీకు మద్దతు ఇవ్వని వ్యక్తి లేదా అవసరమైన సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే వ్యక్తి.. ఇలాంటి వ్యక్తులు మీ శ్రేయోభిలాషులు కాలేరని అర్థం చేసుకోండి. అయితే అలాంటి వ్యక్తులు మిమ్మల్ని తిరిగి ఇబ్బందుల్లో పడవేస్తారు. వారిని దూరంగా  ఉంచడం తెలివైన పని.
  4. చాణక్యుడు ప్రకారం స్వార్థ స్వభావం ఉన్న వ్యక్తి.. తనకు అవసరమైతే అత్యంత సన్నిహితుడిని కూడా మోసం చేయడానికి వెనుకాడడు. స్వార్ధం ఉన్న వ్యక్తులు తమకు మంచి జరుగుతుందంటే.. ఎలాంటి మోసానికైనా వెనుకాడరు. అలాంటి వ్యక్తితో స్నేహం లేదా శత్రుత్వం  ఏర్పడకుండా దూరంగా ఉండండి.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)