Shani Transit: రాశిని మార్చుకున్న శని.. 2025 వరకూ ఈ ఐదు రాశుల వారికీ అన్నీ కష్టాలే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

గత రెండున్నర ఏళ్లుగా మకరరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ సంవత్సరం జనవరి 17, 2023న కుంభరాశిలోకి ప్రవేశించాడు. మకర,  కుంభ రాశులకు శనీశ్వరుడు అధిపతి. శని అర్ధ-సగం దశ శని సంచరించే రాశిలో ప్రారంభమవుతుంది. శని రాశి మారడం వల్ల మకర, కుంభ, మీన రాశుల వారు సడే సతి వివిధ దశలను దాటాల్సి ఉంటుంది.

Shani Transit: రాశిని మార్చుకున్న శని.. 2025 వరకూ ఈ ఐదు రాశుల వారికీ అన్నీ కష్టాలే..  అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Shaniswarudu
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2023 | 1:01 PM

జ్యోతిష్య పరంగా  2023 చాలా ప్రత్యేకమైన సంవత్సరం. 2023 సంవత్సరంలో.. అనేక పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. దీంతో అన్ని రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ సంవత్సరం, శని, గురు, రాహువుతో సహా అనేక పెద్ద..  ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. శనీశ్వరుడు తన రాశిని మార్చుకున్నాడు.. గత నెలలో అంటే జనవరి 17, 2203లో కుంభరాశిలోకి ప్రవేశింకెచ్చాడు. అనంతరం బృహస్పతి.. ఏప్రిల్ 22, 2023 న తన స్వంత రాశి అయిన మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. 2023 సంవత్సరం చివర్లో రాహు-కేతువులు కూడా తమ రాశుల గమనాన్ని మార్చుకోనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని, గురు , రాహువుల రాశి మార్పు చాలా ముఖ్యమైనది.

ఇప్పటికే రాశిని మార్చుకున్న శనీశ్వరుడు

వేద జ్యోతిషశాస్త్రంలో.. శనీశ్వరుడు న్యాయం , పనుల ఆధారంగా శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు. శనిగ్రహం అన్ని గ్రహాలలోకెల్లా అతి నెమ్మదిగా కదిలే గ్రహం. దీని కారణంగా శని ప్రభావం వ్యక్తులపై చాలా కాలం పాటు ఉంటుంది. సాధారణంగా.. శనీశ్వరుడు  అశుభాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంఉన్న సమయంలో ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.  అయితే జాతకంలో శని స్థానం బలంగా ఉన్నప్పుడు.. వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

గత రెండున్నర ఏళ్లుగా మకరరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ సంవత్సరం జనవరి 17, 2023న కుంభరాశిలోకి ప్రవేశించాడు. మకర,  కుంభ రాశులకు శనీశ్వరుడు అధిపతి. శని అర్ధ-సగం దశ శని సంచరించే రాశిలో ప్రారంభమవుతుంది. శని రాశి మారడం వల్ల మకర, కుంభ, మీన రాశుల వారు సడే సతి వివిధ దశలను దాటాల్సి ఉంటుంది. శని 2205 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో 2025 సంవత్సరం వరకు 5 రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. 2025 వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన 5 రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి ఈ సంవత్సరం శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటకరాశి వారిపై శని ప్రభావం మొదలైంది. శనిదేవుడు ఈ రాశి వారి  ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు. దీని కారణంగా రానున్న రోజుల్లో వీరికి కష్టాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగం చేసే వ్యక్తులు తమ ఆఫీసులో చాలా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు.

కన్య రాశి ఈ రాశి వారు కూడా 2025 సంవత్సరం వరకు సమస్యలు, వ్యాధులు, అపజయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పనుల్లో మిశ్రమ ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరగడం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. తగాదాలు పెరగవచ్చు.అంతేకాదు చాలా మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి ఈ సంవత్సరం వారిపై శని ప్రభావం ఉంటుంది. దీంతో వీరు 2025 సంవత్సరం వరకు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ ఆస్తికి సంబంధించి వివాదాలు ఏర్పడవచ్చు. ఈ రాశి వ్యాపారస్తులకు రాబోయే సంవత్సరం కష్టాలతో నిండి ఉంటుంది.  మరోవైపు, ఉద్యోగస్తులు కూడా తమ ఆఫీసులో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు.

కుంభ రాశి ఈ రాశి వారిపై శని ప్రభావం రెండవ దశ ప్రారంభమైంది. ఇది వచ్చే 2025 వరకు ఉంటుంది. శని వీరి లగ్న గృహంలో కూర్చున్నాడు. వీరు ఉద్యోగం, వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గౌరవం తగ్గవచ్చు. వీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు ఇతరులతో ఏదైనా విషయాన్నీ మాట్లాడాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)