AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri: శివయ్య పూజ కోసం శంఖాన్ని ఉపయోగిస్తున్నారా.. కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఎందుకంటే

శివలింగాన్ని పూజించే సమయంలో కొన్ని వస్తువులను ఉపయోగించడం నిషేధించబడింది. శివుని పూజలో ఎప్పుడూ శంఖం ఎందుకు ఉపయోగించరు? దీని వెనుక ఉన్న పురాణా కథ గురించి నేడు  తెలుసుకుందాం...

Mahashivratri: శివయ్య పూజ కోసం శంఖాన్ని ఉపయోగిస్తున్నారా.. కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఎందుకంటే
Maha Shivaratri 2023
Surya Kala
|

Updated on: Feb 10, 2023 | 11:41 AM

Share

హిందూ మతంలో మహాశివరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ 18 ఫిబ్రవరి 2023 న జరుపుకోనున్నారు. ఈ రోజు లింగోద్భవం జరిగిందని.. శివ పార్వతుల కళ్యాణం జరిగిందని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను అత్యంత భక్తుశ్రద్ధలతో జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున శివయ్యను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి ఉపవాసం చేపట్టి.. శివాలయాల్లో ప్రత్యేక పూజలు జలాభిషేకం నిర్వహిస్తారు. ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి, అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. శివుని ఆరాధనలో శివలింగానికి జలాభిషేకం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. శివుని ఆరాధనలో బిల్వ పత్రాలు, గంగ జలం, ఉమ్మెత్త, పాలు-పెరుగులు ముఖ్యంగా భావిస్తారు. వీటితో  అభిషేకం చేస్తే..  శివుడు ప్రసన్నుడవుతాడు. అయితే శివలింగాన్ని పూజించే సమయంలో కొన్ని వస్తువులను ఉపయోగించడం నిషేధించబడింది. శివుని పూజలో ఎప్పుడూ శంఖం ఎందుకు ఉపయోగించరు? దీని వెనుక ఉన్న పురాణా కథ గురించి నేడు  తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం శంఖచూడుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉన్నాడు. శంఖచూడుడు తండ్రి పేరు దైత్య దంభ. దైత్యదంభుడికి చాలా సంవత్సరాలుగా సంతానం కలగలేదు.. అప్పుడు సంతానం పొందాలనే కోరికతో.. అతను విష్ణువు అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు. దైత్యారంభుని తపస్సుకు సంతోషించిన విష్ణువు..మూడు లోకాల్లోనూ జయించి అజేయుడయ్యె కొడుకుని వరంగా ప్రసాదించాడు. దైత్యదంభుడికి విష్ణవు వర ప్రసాదంతో శంఖచూడుడు జన్మించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శంఖచూడుడు  బ్రహ్మ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు  అజేయుడు అనే వరం ఇచ్చాడు. అంతేకాదు శంఖచూడ, శ్రీ కృష్ణ కవచాన్ని అందించాడు. అంతేకాదు.. ధర్మధ్వజుని కుమార్తె బృందని వివాహం చేసుకోవాలని  శంఖచూడుడికి సూచించాడు. బృంద అనంతరం తులసిగా పిలువబడుతోంది.

శంఖచూడుడు బృందని వివాహం చేసుకున్నాడు. విష్ణువు, బ్రహ్మ ఇద్దరి ఆశీర్వాదాలను పొందిన శంఖచూడుకి తాను చాలా శక్తివంతుడినని గర్వం పెరిగింది. వరంతో మూడు లోకాలను పరిపాలించడం ప్రారంభించాడు. యుద్ధంలో దేవతలను ఓడించాడు.  శంఖచూడికి భయపడిన దేవతలు తమకు సహాయం చేయమని విష్ణువు వద్దకు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

అయితే విష్ణువు, బ్రహ్మలు స్వయంగా శంఖచూడికి అజేయంగా ఉండే వరం ఇచ్చారు. దీంతో ఈ రాక్షసుడి వధ కోసం శివుడిని ప్రార్థించమని సూచించారు. శంఖచూడుడు శ్రీకృష్ణ కవచం, తులసి దేవి పాతివ్రత్యంతో రక్షణ పొందుతున్నాడు. దీని కారణంగా శివుడు కూడా  శంఖచూడిని చంపలేకపోయాడు. అప్పుడు విష్ణువు బ్రాహ్మణ రూపాన్ని ధరించి.. రాక్షస రాజు శంఖచూడు నుండి శ్రీకృష్ణ కవచాన్ని బహుమతిగా స్వీకరించి.. ఆపై శంఖచూడి రూపాన్ని ధరించి, బృందా దేవి  పాతివ్రత్యాన్ని అపహరించాడు. అనంతరం యుద్ధంలో శివయ్య తన త్రిశూలంతో శంఖచూడుడిని వధించాడు. అతని ఎముకల నుండి అప్పుడు శంఖం పుట్టింది. అయితే శంఖచూడుడు విష్ణు భక్తుడు. లక్ష్మీ-విష్ణువులకు శంఖం నీరు చాలా ఇష్టం. అంతేకాదు దేవతలకు శంఖం నుండి నీటిని సమర్పించడం విశిష్టమైందిగా పేర్కొంది. అయితే శంఖచూడుడుని శివుడు వధించడం వల్ల శివుని పూజకు శంఖాన్ని ఊదరు. శంఖంతో శివునికి జలాభిషేకం చేయరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)