AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Guru Yuti: 12 ఏళ్ల తర్వాత సూర్యగురు యుతి యోగం.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి

జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం..  ఏప్రిల్ 22, 2023 న, గ్రహాల రాజు సూర్యుడు..  బృహస్పతి మేషరాశిలో కలవబోతున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కూటమి ఏర్పడబోతుంది. ఈ కలయిక కొన్ని రాశుల వారికీ శుభాలను.. మరికొందరికి ఊహించని కష్టాలను అందించనున్నది. 

Surya Guru Yuti: 12 ఏళ్ల తర్వాత సూర్యగురు యుతి యోగం.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి
Surya Guru Yuti 2023
Surya Kala
|

Updated on: Feb 14, 2023 | 9:55 AM

Share

వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు అధిపతి, ప్రత్యక్ష దైవం సూర్యుడికి, దేవతల గురువు బృహస్పతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు గౌరవం, కీర్తి, ఆరోగ్యాన్ని కలిగించే గ్రహం అయితే, గురువు ఆనందం, సంపద , వైవాహిక జీవితాన్ని అందించే గ్రహంగా పరిగణించబడుతుంది. 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఒకే రాశిలో బృహస్పతి, సూర్యుడు ఇద్దరూ కలిసి ఉండబోతున్నారు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం..  ఏప్రిల్ 22, 2023 న, గ్రహాల రాజు సూర్యుడు..  బృహస్పతి మేషరాశిలో కలవబోతున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 22  బృహస్పతి  తన సొంత రాశి అయిన మీనరాశి నుంచి సూర్యుడు ఉన్న మేషరాశిలో అడుగు పెట్టనున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కూటమి ఏర్పడబోతుంది. ఈ కలయిక కొన్ని రాశుల వారికీ శుభాలను.. మరికొందరికి ఊహించని కష్టాలను అందించనున్నది.  పెను  వాస్తవానికి, సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటే.. అదే సమయంలో బృహస్పతి 13 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. బృహస్పతి-సూర్యుడు సంయోగం .. అంటే సూర్యగురు గ్రహాల యుతి వలన ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు తెల్సుకుందాం..

  1. మేషరాశి: ఏప్రిల్ 22, 2023 తర్వాత, బృహస్పతి రాశిని మార్చుకుని..  మేషరాశిలో అడుగు పెట్టనున్నాడు. అక్కడ ఉన్న సూర్యునితో కలయిక ఏర్పడనుంది. ఈ సమయం ఈ రాశి వారికి శుభప్రదంగా.. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో పురోగతిని పొందుతారు. ఆర్ధిక లాభాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్‌తో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం ఈ రాశి వారి సొంతం. ఏ పనిచేపట్టినా కలిసి వస్తుంది. సృజనాత్మక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది.
  2. మిధునరాశి ఈ రాశి వ్యక్తులకు సూర్యగురు గ్రహాల యుతి  వలన ఊహించని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. రాబోయే కాలం చాలా బాగుంటుంది. డబ్బు , సౌకర్యాల విషయాలలో వీరు చాలా అదృష్టాన్ని పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో భాగస్వామ్యం కోసం ఈ సమయం చాలా మంచిది. కుటుంబంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. మీరు కొన్ని పెద్ద పనిని పొందే అవకాశం ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పును చూస్తారు.
  3. తుల రాశి సూర్యగురు గ్రహాల యుతి  ఈ రాశివారికి వరం కంటే తక్కువ కాదు. ఆర్థికంగా, సూర్యుడు-బృహస్పతి కలయిక  వీరికి అన్ని రంగాల్లో విజయాన్ని అందిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందడం ద్వారా, మీ వ్యాపారం అనేక రెట్లు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. చాలా సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్న పనులు పూర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో లక్ష్మిదేవి ఆశీర్వాదం వీరికి లభించడంతో సుఖ సంతోషాలు లభిస్తాయి.
  4. సింహరాశి సింహ రాశి వారికి సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల ఆత్మవిశ్వాసం, గౌరవం బాగా పెరుగుతాయి. సింహ రాశికి అధిపతి సూర్యుడు. అటువంటి పరిస్థితిలో.. సూర్యగురు గ్రహాల యుతి కలయిక ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ కూటమి తర్వాత ఆర్థిక లాభం కోసం ఉత్తమ అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)