Maha Shivratri: మహా శివరాత్రికి దీపకాంతులతో వెలిగిపోనున్న ఉజ్జయిని.. గిన్నిస్ రికార్డ్ సృషించేందుకు శైవ క్షేత్రం రెడీ

శివరాత్రి రోజున ఉజ్జయిని క్షేత్రం దీపాల వెలుగులతో ధగధగ మెరిసిపోనుంది. మెగా ఈవెంట్ కోసం సన్నాహాలను CM చౌహాన్ సమీక్షించారు. అంతేకాదు ఫిబ్రవరి 18న దీపావళి వలె ఉజ్జయినిలో మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నట్లు తెలిపారు. 21 లక్షల దీపాలు వెలిగించే ఈ అపూర్వమైన కార్యక్రమానికి ప్రభుత్వ భాగస్వామ్యం కానుందని చౌహాన్ అన్నారు.

Maha Shivratri: మహా శివరాత్రికి దీపకాంతులతో వెలిగిపోనున్న ఉజ్జయిని.. గిన్నిస్ రికార్డ్ సృషించేందుకు శైవ క్షేత్రం రెడీ
Maha Shivratri 2023
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2023 | 4:14 PM

మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల సహా ప్రముఖ శివాలయాలు ముస్తాబవుతున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేకాదు.. ఈ క్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీన  ‘శివజ్యోతి అర్పణం-2023’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉజ్జయిని నగరంలో దాదాపు 21 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత ఏడాది మహాశివరాత్రి నాడు ఉజ్జయినిలో 11,71,078 మట్టి దీపాలు వెలిగించారు. ఇప్పుడు ఏకంగా 21 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

శివరాత్రి రోజున ఉజ్జయిని క్షేత్రం దీపాల వెలుగులతో ధగధగ మెరిసిపోనుంది. మెగా ఈవెంట్ కోసం సన్నాహాలను CM చౌహాన్ సమీక్షించారు. అంతేకాదు ఫిబ్రవరి 18న దీపావళి వలె ఉజ్జయినిలో మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నట్లు తెలిపారు. 21 లక్షల దీపాలు వెలిగించే ఈ అపూర్వమైన కార్యక్రమానికి ప్రభుత్వ భాగస్వామ్యం కానుందని చౌహాన్ అన్నారు.

ఉజ్జయినిలో శివజ్యోతి అర్పణం కార్యక్రమంలో భాగంగా నగరంలోని దేవాలయాలు, వాణిజ్య స్థలాలు, గృహాలు, క్షిప్రా నదీ తీరంతోపాటు ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లో మట్టి దీపాలు వెలిగించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఉజ్జయినిలోని ప్రముఖ ప్రదేశాలు విద్యుత్ దీపాలతో పాటు, రంగు రంగుల ముగ్గులతో అందంగా అలంకరించనున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

క్షిప్రా నది ఒడ్డున ఉన్న కేదారేశ్వర్ ఘాట్ వద్ద సుమారు 3 లక్షల 10 వేల దీపాలు, సునేహ్రీ ఘాట్ వద్ద 1 లక్షా 75 వేలు, దత్ అఖారా వద్ద 4 లక్షల 50 వేలు, రామ్ ఘాట్ నుండి బొంబాయి ధర్మశాల వరకు 2 లక్షల 50 వేలు, 3 లక్షల 75 వేలు దీపాలు వెలిగించడానికి అధికారులు .. ప్రజలు, భక్తుల సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. బొంబాయి ధర్మశాల నుండి నర్సింహ మందిరం వరకు. అలాగే మాలి ఘాట్‌లో భుఖీ మాత ఆలయం వైపు నాలుగు లక్షల 75 వేల దీపాలు వెలిగించే యోచనలో అధికారులు ఉన్నారు.

గత ఏడాది మహాశివరాత్రి నాడు ఉజ్జయినిలో 11,71,078 దీపాలను వెలిగించిన తర్వాత, 2022 దీపావళి రోజున ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో 15.76 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వారు తెలిపారు. ఈసారి మహాశివరాత్రి నాడు ఉజ్జయినిలో జరిగే కార్యక్రమం ‘జీరో వేస్ట్’ అనే విధానంపై చేపట్టనున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..