Eclipses in 2023: ఈ ఏడాదిలో ఎన్ని గ్రహణాలు ఏర్పడనున్నాయి.. మనదేశంలో వీటి ప్రభావం ఏ విధంగా ఉండనున్నదో తెలుసా..

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు. దీని తర్వాత సంవత్సరంలో రెండవ, చివరి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం శరత్ పూర్ణిమ రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో చూడవచ్చు. సంవత్సరంలో ఏర్పడనున్న నాలుగు గ్రహణాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

Eclipses in 2023: ఈ ఏడాదిలో ఎన్ని గ్రహణాలు ఏర్పడనున్నాయి.. మనదేశంలో వీటి ప్రభావం ఏ విధంగా ఉండనున్నదో తెలుసా..
Eclipses In 2023
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2023 | 8:56 AM

జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రంలో గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు రానుండగా, అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. 2023లో ఏర్పడే తొలి గ్రహణం సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూతకం ఉండదు. ఈ సంవత్సరంలో రెండవ గ్రహణం చంద్ర గ్రహణం అవుతుంది. ఇది ఉప ఛాయ (పెనుంబ్రల్) చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీనిని చూడవచ్చు.

అనంతరం 2023 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం వార్షిక గ్రహణం అవుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు. దీని తర్వాత సంవత్సరంలో రెండవ, చివరి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం శరత్ పూర్ణిమ రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో చూడవచ్చు. సంవత్సరంలో ఏర్పడనున్న నాలుగు గ్రహణాల గురించి వివరంగా తెలుసుకుందాం.

మొదటి సూర్యగ్రహణం 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడుతుంది. ఈ గ్రహణం అమావాస్య తిథి నాడు ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో చూడలేని కంకణాకృతి సూర్యుడు. భారతదేశంలో గ్రహణం కనిపించనందున.. సూతకం కాలం ఉండదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, అంటార్కిటికా, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మొదటి చంద్ర గ్రహణం 2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం ఛాయా చంద్రగ్రహణం అవుతుంది. హిందూ సనాతన ధర్మంలో పెనుంబ్రల్ చంద్ర గ్రహణం గ్రహణంగా పరిగణించబడదు. ఇందులో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో కనిపిస్తుంది.

రెండవ సూర్యగ్రహణం 2023 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14న కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం వార్షికంగా ఉంటుంది. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి..  దీనికి మతపరమైన ప్రాముఖ్యత ఉండదు. అందుకే ఈ సూర్యగ్రహణానికి కూడా సూత కాలం చెల్లదు.

రెండవ చంద్ర గ్రహణం సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం భారతదేశంలో చూడవచ్చు. అక్టోబర్ 28న ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణాన్ని భారతదేశంలోని అనేక ప్రదేశాలలో చూడవచ్చు. ఈ చంద్రగ్రహణ సమయంలో సూత కాలం ఉంటుంది.  ఈ చంద్ర గ్రహణం అక్టోబర్ 28 రాత్రి 01.5 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 02.24 నిమిషాలకు ముగుస్తుంది. భారత్‌తో పాటు యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర-దక్షిణ, ఆఫ్రికా, అంటార్కిటికా, పసిఫిక్ , హిందూ మహాసముద్రంలో ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?