AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel India: మహిళలు ఒంటరి జీవితాన్ని ఆనందించడానికి మన దేశంలో బెస్ట్ ఎంపిక ఈ ప్రదేశాలు

ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేయ్యాలని భావిస్తారు. తమకు నచ్చిన  మెచ్చిన స్థలాన్ని చూడాలని ఆసక్తిని చూపిస్తారు. అయితే కొందరిని ఒంటరి తనం భయపెడుతుంది. అయితే చాలా మందికి ఒంటరి ప్రయాణం సుసంపన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి.

Surya Kala
|

Updated on: Feb 16, 2023 | 11:28 AM

Share
మహిళలు, యుక్తవయస్కులు వివిధ రకాల కారణాలతో ఒంటరిగా ప్రయాణించడం కష్టంగా భావిస్తారు. ఉరుకుల పరుగుల నగర జీవితం, గందరగోళ పరిస్థితి నుంచి తప్పించుకోవడంతో పాటు, జీవితం మెరుగైన పనితీరుకు అవసరమైన అంతర్గత శాంతిని తిరిగి పొందడానికి అంతర్గత స్వీయ వైపు ప్రయాణం మేలు చేస్తుంది. మహిళా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. రొటీన్ జీవితం నుంచి తప్పించుకుని..  ప్రకృతిని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ప్రయాణం చేస్తారు. ఇలా ఒంటరి ప్రయాణాన్ని చేయాలనుకునేవారు సరస్సులు, కోటలతో నిండిన నగరాన్ని ఎంపిక చేసుకోండి. (Photo Credit: Pixabay)

1 / 6
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక నగరం ఉదయ్‌పూర్. ఈ నగర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, విస్మయానికి గురిచేసే ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ సన్ సెట్, సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. సంతోషకరమైన ప్రయాణాన్ని గడపాలనుకునేవారికి ఈ నగరం బెస్ట్ ఎంపిక. నగరంలోని వైవిధ్యమైన హవేలీలను కూడా సందర్శించవచ్చు. రకరకాల మెహందీలు మహిళలను ఆకర్షిస్తాయి. "దాల్ బాతి చుర్మా" నుండి "గట్టే కి సబ్జీ" వరకు అత్యంత ప్రత్యేకమైన రాజస్థానీ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. (Photo Credit: Pixabay)

2 / 6
ఉదయపూర్ పర్యటన తర్వాత ఆగ్రా ఒంటరి మహిళ పర్యటించడానికి బెస్ట్ ప్లేస్. ఢిల్లీలోని ముఖ్యమైన చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం ఒంటరి ప్రయాణీకులకు కూడా అద్భుతమైన ఎంపిక. యమునా నది ఒడ్డున ఉన్న నగరం ఆగ్రా (Photo Credit: Pixabay)

3 / 6
మీరు పచ్చని పర్వత సానువులతో ప్రశాంతంగా, సహజమైన అందాల ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటే సిక్కిం ప్రయాణానికి అనువైన ప్రదేశం. ప్రత్యేకించి ఒంటరిగా ఉండే మహిళా ప్రయాణికులకు, ఈ ప్రదేశం మంచుతో కప్పబడిన పర్వతాలకు అభిముఖంగా ఉన్న హోమ్‌స్టేలలో ఒకదానిలో ఒక కప్పు వేడి కాఫీ లేదా టేబుల్ పక్కన గ్రీన్ టీతో ఒంటరిగా సమయాన్ని ఆస్వాదించడానికి సరైనది. వేడి పానీయాలతో పాటు, మెల్లగా ఉదయించే సూర్యునిచే పొగమంచు వెదజల్లుతున్న దృశ్యం.. సమీపంలో పక్షుల కిలకిలారావాలు  వినోదాన్ని రెట్టింపు చేస్తుంది.టిబెటన్-శైలి గొంపస్ వంటి చారిత్రక అద్భుతాలను జలపాతాలు, రోడోడెండ్రాన్ పువ్వులు, ఆల్పైన్ పచ్చికభూములు,  మరెన్నో ప్రకృతి అందాలను సందర్శించవచ్చు. అక్టోబర్ - మార్చి మధ్య సిక్కిం సందర్శించడానికి అనువైన సమయం. (Photo Credit: Pixabay)

4 / 6
పాండిచ్చేరి ఒక చిన్న ఫ్రెంచ్ పట్టణం.. అనేక మంది ఒంటరి ప్రయాణీకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో సందర్శించే వారందరికీ మళ్ళీ జీవిస్తున్నామనే అనుభవాన్ని ఇస్తుంది. రోడ్లకి ఇరువైపులా ఉన్న చెట్లు అందమైన పందిరిని నిర్మించినట్లు అనిపిస్తాయి. చేతిలో కప్పు కాఫీతో ఆనందించవచ్చు. పాండిచ్చేరిలోని ఇళ్ళు ప్రకాశవంతంగా, ఉత్సాహంగా ఉంటాయి. ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు ఈ ప్రాంతంలో పర్యటన మంచి ఎంపిక. సాయంత్రం సముద్రం ఒడ్డున సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ..  రాక్‌పై లవణ స్నానం సువాసనగల కొవ్వొత్తులతో సుదీర్ఘమైన, విలాసవంతమైన స్నానం చేయడం.. మంచి అనుభూతినిస్తుంది. అరేబియా సముద్రం తీరంలో విహార ప్రదేశంలో కూడా నడవవచ్చు. పాండిచ్చేరి నుంచి ఒక గంట ప్రయాణించి ఆరోవిల్ టౌన్‌షిప్‌ను సందర్శించవచ్చు. (Photo Credit: Pixabay)

5 / 6
రిషికేశ్ ఒంటరి మహిళల ప్రయాణానికి అనువైనది. "ది యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అనేది గంగానది ఒడ్డుకు సమీపంలో ఉన్నందున ఈ ప్రదేశానికి ఈ పేరు ఏర్పడింది. ఒంటరిగా ఉండే మహిళా ప్రయాణికులు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఆసక్తిని చూపించడానికి మరో కారణం రుచికరమైన ఆహారం.   ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే మళ్ళీ పునరుజ్జీవం అయినా ఫీలింగ్ ని ఇస్తాయి. కుండల తయారీ, ఆర్ట్ వర్క్‌షాప్‌లు, ధ్యాన సెషన్‌లు.. ఇలా ఏడాది పొడవునా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.   గంగా నది ఒడ్డున ప్రశాంతమైన వదనంతో, ఆలోచనలతో ఒంటరిగా విహరించడం వలన ఎంతో హాయిగా ఉంటుంది. (Photo Credit: Pixabay)

6 / 6