AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lottery Winner: అమెరికాలో భారీ మొత్తం రూ.16,590 కోట్లు గెలుచుకున్న విజేత పేరుని ప్రకటించిన కంపెనీ..

మిస్టర్ క్యాస్ట్రో విజేత టిక్కెట్‌ను నవంబర్ ప్రారంభంలో కాలిఫోర్నియాలోని అల్టాడెనాలో కొనుగోలు చేశారు. ఒక్క టిక్కెట్ ఖరీదు రెండు డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.160. అయితే ఈ లాటరీలో ఎంత మొత్తం ఇవ్వనున్నారనేది.. టికెట్ కోలుగోలు చేసే సమయంలో ఎవరికీ తెలియదు..

Lottery Winner: అమెరికాలో భారీ మొత్తం రూ.16,590 కోట్లు గెలుచుకున్న విజేత పేరుని ప్రకటించిన కంపెనీ..
Us Lottery Winner
Surya Kala
|

Updated on: Feb 16, 2023 | 9:47 AM

Share

2022  నవంబర్‌లో అగ్రరాజ్యం అమెరికాలోనే రికార్డు స్థాయిలో 2.04 బిలియన్లను గెలుచుకున్న విజేత వివరాలను ఎట్టకేలకు ఆ లాటరీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మొత్తం యుఎస్ చరిత్రలో అతి పెద్ద మొత్తమని పేర్కొన్నారు. యూఎస్ లో భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న విజేత ఎడ్విన్ క్యాస్ట్రో పేరుని లాటరీ డైరెక్టర్ అల్వా జాన్సన్ ప్రపంచానికి తెలిపారు. ఎడ్విన్ కాస్ట్రో గెలుచుకున్న మొత్తం 2.04 బిలియన్ డాలర్లు.. అంటే మన దేశపు కరెన్సీలో దాదాపు రూ.16,590 కోట్లు.. నవంబర్ లో విజేతను ప్రకటించింది. తాజాగా ఆ విజేత పేరుని ప్రకటించింది.. అయితే అతనికి సంబంధించిన వివరాలను మాత్రం లాటరీ నిర్వాహకులు సమావేశంలో వెల్లడించలేదు.

CNN ప్రకారం.. మిస్టర్ క్యాస్ట్రో విజేత టిక్కెట్‌ను నవంబర్ ప్రారంభంలో కాలిఫోర్నియాలోని అల్టాడెనాలో కొనుగోలు చేశారు. ఒక్క టిక్కెట్ ఖరీదు రెండు డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.160. అయితే ఈ లాటరీలో ఎంత మొత్తం ఇవ్వనున్నారనేది.. టికెట్ కోలుగోలు చేసే సమయంలో ఎవరికీ తెలియదు.. టికెట్ల అమ్మకాలు, పోటీ వంటి వాటిపై ఆధారపడి లాటరీ మొత్తాన్ని ఆ లాటరీ నిర్వహికులు నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సారి రూ.16,590 కోట్ల లాటరీగా నిర్ణయించారు. లాటరీ డ్రా చేసే సమయంలో మొత్తం ఆరు సంఖ్యలకు సరిపోలింది.

కాలిఫోర్నియాలో చట్టాల ప్రకారం..  లాటరీ విజేత పేరు , ఇతర సంబంధిత సమాచారం బహిరంగంగా వెల్లడించాలి. అయితే దీనికి  కొన్ని షరతులు ఉన్నాయి లాటరి టికెట్ గెలిచిన వ్యక్తి పూర్తి పేరు, విజేత టిక్కెట్‌ను విక్రయించిన రిటైలర్ పేరు, స్థానం, జాక్‌పాట్ గెలిచిన తేదీ, విజయాల మొత్తం (చెల్లింపుల వివరాలతో సహా) బహిర్గతం చేయడానికి మాత్రమే అనుమతిస్తాయి. ఈ నిబంధనలను అనుసరిస్తూ.. లాటరీ నిర్వాకులు భారీ మొత్తం గెలిచిన విజేత పేరు ఎడ్విన్ క్యాస్ట్రోగా ప్రకటించారు. అయితే ఎడ్విన్ కాస్ట్రో తాను బహిరంగంగా కనిపించడానికి ఇష్టపడడం లేదు.

ఇవి కూడా చదవండి

లాటరీ డ్రా తీసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు బహుమతిని క్లెయిమ్ చేసుకోవచ్చు అని లాటరీ అధికారులు చెప్పారు. అయితే, ఎడ్విన్ తక్కువ మొత్తం ఒకేసారి తీసుకునేందుకే సిద్ధపడ్డాడు. దీంతో అతడు 997 మిలియన్ డాలర్లు ఒకేసారి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎడ్విన్.. తాను లాటరీ గెలిచిన విషయం తెలియగానే షాక్‌కు గురయ్యాడని నిర్వాహకులు తెలిపారు. విజేత టికెట్ ప్రకటించిన తర్వాత, గోల్డెన్ టిక్కెట్‌ను విక్రయించిన సేవా కేంద్రం $1 మిలియన్ల పవర్‌బాల్ బోనస్‌ను అందుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..