మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 150కి పైగా బట్టలు, కిరాణా దుకాణాలు దగ్ధం..

రాత్రికి రాత్రే 25కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. బట్టల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఇప్పటివరకు విచారణలో తేలిందన్నారు.

మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 150కి పైగా బట్టలు, కిరాణా దుకాణాలు దగ్ధం..
Fire In Assam
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 17, 2023 | 7:06 AM

అస్సాంలోని జోర్హాట్‌లో గురువారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ఇక్కడి చౌక్ మార్కెట్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. పలు ఫైరింజన్ల సాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. అర్థరాత్రి ఒంటిగంట వరకు మంటలను ఆర్పే పని కొనసాగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్ ప్రధాన గేటుకు సమీపంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమేపీ విస్తరిస్తూ రాత్రి 1 గంట వరకు దాదాపు 150 దుకాణాలు దగ్ధమైనట్లు సమాచారం.

జోర్హాట్‌లోని AT రోడ్‌లో చౌక్ బజార్ ఉంది. ఇక్కడి ఓ బట్టల దుకాణంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో దుకాణదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి 150కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. 25కి పైగా ఫైర్‌ ఇంజిన్‌ వాహనాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి.

ఇవి కూడా చదవండి

రాత్రికి రాత్రే 25కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. బట్టల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఇప్పటివరకు విచారణలో తేలిందన్నారు. అక్కడి నుంచి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటన జరిగినప్పుడు మార్కెట్‌లోని షాపులన్నీ మూసి ఉంచారని, దీంతో ఎవరికీ మంటలు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. 150 దుకాణాలలో చాలా వరకు బట్టలు, కిరాణా దుకాణాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చుట్టుపక్కల వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇక్కడి రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అగ్నిమాపక దళం వాహనాలు రావటానికి ఇబ్బంది ఏర్పడుతోంది. వాహనం రావడం ఆలస్యం కావడంతో మంటలు అంతటా వ్యాపించాయి. మరోవైపు, అగ్నిప్రమాదం వల్ల జరిగిన ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. మంటలను ఆర్పివేసిన తర్వాతే దాని వల్ల జరిగిన నష్టం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..