Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beawar Fire: జాతీయ రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ సహా మూడు వాహనాలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం.. కాలి బూడిదైన పలు ఇళ్లు, వాహనాలు

ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లతో సహా ముగ్గురు మృతి చెందినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

Beawar Fire: జాతీయ రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ సహా మూడు వాహనాలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం.. కాలి బూడిదైన పలు ఇళ్లు, వాహనాలు
Beawar Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 17, 2023 | 8:06 AM

రాజస్థాన్‌లోని జైపూర్-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఉన్న బీవార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇక్కడ హైవేపై మూడు వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. 3 వాహనాల్లో ఒకటి ఆయిల్ ట్యాంకర్ ఉంది. వాహనాలు ఢీకొన్న వెంటనే పెద్ద శబ్ధంతో మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. వాహనాలు ఢీకొన్న సమయంలో భారీగా పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఈ పేలుళ్ల శబ్ధం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఆకాశం ఎత్తులో మంటలు ఎగసిపడ్డాయి. హైవేపై వాహనాల మంటలతో దుమ్ము లేచింది. పేలుళ్లతో ఎగసిపడుతున్న మంటలను చూసి బీవర్ నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. హైవేకి ఆనుకుని ఉన్నఆరు షాపులకు కూడా నిప్పంటుకుంది. చమురు, గాలి తాకడంతో మంటలు మిస్సిపురా ప్రాంతానికి వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దాదాపు 12 ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పలు ఇళ్ల గోడలు కూలిపోగా, పలు ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. చాలా ఇళ్లలో మంటలు చెలరేగడంతో సర్వం దగ్ధమైంది. ఒక టూవీలర్‌ వాహనం దగ్ధమైంది. ఇళ్లలో ఉంచిన దాదాపు అరడజను వాహనాలు కాలి బూడిదయ్యాయి.

ఇళ్లలోకి మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అధికారులు ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అడిషనల్ ఎస్పీ వైభవ్ శర్మ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీష్ సింగ్, పలు పోలీస్ స్టేషన్ల పోలీసు అధికారులు, భారీ పోలీసు బలగాలను సంఘటనా స్థలంలో మోహరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అగ్నిమాపక యంత్రం అనేక రౌండ్ల కారణంగా, సైరన్ల శబ్దం నగరంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీంతో జనం భారీగా గుమిగూడారు. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం కారణంగా జైపూర్‌-ఉదయ్‌పూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. కొన్ని గంటలపాటు హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. మంటలను ఆర్పిన తర్వాత ట్రాఫిక్‌ను మళ్లించి సాఫీగా మార్చారు.

అగ్నిప్రమాదం కారణంగా మిస్సిపురా ప్రాంతంలో డజనుకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రజలు ఒక్కసారిగా భారీ పేలుళ్ల శబ్ధం విని భయపడిపోయారు. మంటలు చెలరేగడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా ప్రజలు పంట పొలాల్లోనే కూర్చొని ఉన్నారు. మహిళలు, చిన్నారులు చలిలోనే బహిరంగ ప్రదేశంలో రాత్రంతా పంట పొలాల్లోనే గడిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లతో సహా ముగ్గురు మృతి చెందినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీష్ సింగ్ తెలిపారు. చాలా మంది కాలిపోవడంతో అమృతకౌర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..