AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Tourism: పర్యాటక రంగంపై కేంద్రం దృష్టి.. మే 17 నుంచి ఢిల్లీలో టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

దేశంలో పర్యాక రంగంపై దృష్టి సారించింది కేంద్రం. ఢిల్లీలో జరిగిన టూరిజం ఇన్ మిషన్ మోడ్ కార్యక్రమం టీజర్ ను లాంచ్ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  

India Tourism: పర్యాటక రంగంపై కేంద్రం దృష్టి.. మే 17 నుంచి ఢిల్లీలో టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
Minister Kishan Reddy
Surya Kala
|

Updated on: Feb 17, 2023 | 7:34 AM

Share

దేశంలో ఫస్ట్ టైం టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తుంది కేంద్రం. ఢిల్లీ అశోక హోటల్లో టూరిజం ఇన్ మిషన్ మోడ్ కార్యక్రమం జరిగింది. ప్రొగ్రాంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో టీజర్ ఆవిష్కరించారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రానున్న కాలంలో భారత్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా దేశంలో పర్యాటక రంగాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, దాని ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణను ఈ సందర్భంగా వివరించారు.

ఢిల్లీ ప్రగతి మైదాన్ లో మే 17 నుంచి 19 వరకు టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుందని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యాటక రంగ అభివృద్ధి, పర్యాటక రంగంలో పెట్టుబడులు అంశాలపై టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో దృష్టి సారిస్తామన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో దేశ పర్యటక రంగంలో కొత్త మార్పులు తీసుకువస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు కిషన్ రెడ్డి .

ప్రధాని మోడీ ‘వికాస్ భీ ఔర్ విరాసత్ భీ’ నినాదాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. దీని ఫలితంగానే దేశంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ (TTDI) ర్యాంకింగ్స్ లో 20వ స్థానానికి, కల్చరల్ రిసోర్సెస్ ర్యాంకింగ్స్ లో 12వ స్థానానికి, నేచురల్ రిసోర్సెస్ లో 6వ స్థానానికి చేరుకోవడమే పర్యాటక రంగం పెరిగిందనడానికి నిదర్శనం అని చెప్పారు మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే దేశీయ పర్యాటకం కూడా ఊపందుకుందని.. ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం జమ్మూకశ్మీర్ లో కూడా పర్యాటక రంగం ఊపందుకుందని.. గత ఏడాది అందాల సీమను 1.84కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారని.. మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..