కొంతమంది మందు బాబులు వైన్ తాగుతూ.. కీటకాల లార్వాలతో తయారు చేసిన ఫుడ్ ని తినడానికి ఇష్టపడతారు. అలాగే, భారతదేశంలో కూడా కీటకాలను ఆహారంగా తీసుకుంటాజ్రు. అనేక తెగలు తమ పూర్వీకుల నుండి కీటకాలను తినడం వారసత్వంగా పొందాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కీటకాలను తినే అలవాటు ఎక్కువగా ఉంది. పోషకాలు, పర్యావరణ ప్రయోజనాల కోసం ఈశాన్య భారతదేశంలోని అనేక వర్గాల సంప్రదాయ ఆహారంలో కీటకాలు చేర్చబడ్డాయి