YouTube New CEO: సోషల్‌ మీడియా దిగ్గజం యూట్యూబ్‌కు కొత్త CEO.. భారత సంతతికి చెందిన నీల్‌మోహన్‌కు బాధ్యతలు..

భారతీయ-అమెరికన్ నీల్ మోహన్ 2015లో YouTubeలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అతను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

YouTube New CEO: సోషల్‌ మీడియా దిగ్గజం యూట్యూబ్‌కు కొత్త CEO.. భారత సంతతికి చెందిన నీల్‌మోహన్‌కు బాధ్యతలు..
Youtube Ceo Neal Mohan
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 17, 2023 | 8:47 AM

దేశ విదేశాల్లో మన భారతీయులు సత్తా చాటుతున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలను నడిపిస్తున్నారు. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం యూట్యూబ్‌కు కొత్త CEOగా భారతీయుడు నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన నీల్‌మోహన్‌కు బాధ్యతలు అప్పగించింది సంస్థ. యూట్యూబ్‌ చీఫ్ ప్రోడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న నీల్‌ మోహన్‌..ఇప్పుడు CEO అయ్యారు. తొమ్మిదేళ్లపాటు యూట్యూబ్‌ CEOగా ఉన్న సూసన్‌ పదవి నుంచి తప్పుకోవడంతో నీల్‌మోహన్‌కు అవకాశం దక్కింది. నీల్ మోహన్ ప్రస్తుతం యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌లతో సహా యుఎస్ ఆధారిత గ్లోబల్ దిగ్గజాల నేతృత్వంలో పెరుగుతున్న భారతీయ సంతతికి చెందిన సీఇఒల జాబితాలో నీల్ మోహన్ ఇప్పుడు చేరనున్నారు.

నీల్ మోహన్ ఎవరు?

నీల్ మోహన్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్. అతను 2007లో DoubleClick సముపార్జనతో Googleలో చేరిన సుసాన్ వోజికికి సహాయకుడిగా ఉన్నారు. మోహన్ 2015లో యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అతను యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా తన పాత్రలో లఘు చిత్రాలు, సంగీతం, సబ్‌స్క్రిప్షన్‌లపై దృష్టి సారించారు. నీల్ మోహన్ మైక్రోసాఫ్ట్‌లో కూడా పనిచేశారు.

నీల్ మోహన్ ఏం చెప్పారంటే..

ఈ ముఖ్యమైన మిషన్‌ను కొనసాగించడానికి తాను సంతోషిస్తున్నానని, నూతన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నానని నీల్ మోహన్ అన్నానంటూ ట్వీట్ చేసారు, “ధన్యవాదాలు సుసాన్ వోజ్కికి, సంవత్సరాలుగా మీతో పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. మీరు YouTubeని సృష్టికర్తలు, వీక్షకుల కోసం అసాధారణమైన హోమ్‌గా చేసారు. ఈ ముఖ్యమైన మిషన్‌ను కొనసాగించడానికి నేను సంతోషిస్తున్నాను.”

సుసాన్ వోజికి ఎందుకు రాజీనామా చేశారంటే..

తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానని చెప్పారు. తాను, తాన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పనిని ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం