AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: ఇలాంటి ఆఫీస్ లు ఉండాలి భయ్యా.. అప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.. ఇంతకీ విషయమేంటంటే..

ఉద్యోగులకు వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ ఉంటాయి. జీవితంలో ఆ రెండూ ముఖ్యమే. కానీ.. చాలా మంది ఎంప్లాయిస్ తమ పర్సనల్ లైఫ్ కు సమ ప్రాధాన్యం ఇవ్వలేకపోతుంటారు. కారణం.. వృత్తిగత జీవితానికి..

Trending: ఇలాంటి ఆఫీస్ లు ఉండాలి భయ్యా.. అప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.. ఇంతకీ విషయమేంటంటే..
Indore Office
Ganesh Mudavath
|

Updated on: Feb 17, 2023 | 12:17 PM

Share

ఉద్యోగులకు వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ ఉంటాయి. జీవితంలో ఆ రెండూ ముఖ్యమే. కానీ.. చాలా మంది ఎంప్లాయిస్ తమ పర్సనల్ లైఫ్ కు సమ ప్రాధాన్యం ఇవ్వలేకపోతుంటారు. కారణం.. వృత్తిగత జీవితానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడమే. సంస్థ కోసం పని చేయడం బాగానే ఉంటుంది.. కానీ అలా అని చెప్పి మన సరదాలు, సంతోషాలను మానుకోలేం కదా.. ప్రతి ఉద్యోగి తన జీవితంలో ఎక్కువ సమయం ఆఫీస్‌లోనే గడిపేస్తుంటారు. పని ఎక్కువగా ఉంటే ఓవర్‌ టైమ్‌ కూడా చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఫలితంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. సమస్యను ఆఫీస్ వాళ్లకు చెప్పుకున్నా.. పని విషయంలో మాత్రం ఏ యాజమాన్యమైనా చాలా స్ట్రిక్ట్ గానే ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌ కు చెందిన సాఫ్ట్‌గ్రిడ్‌ కంప్యూటర్స్‌ అనే ఐటీ సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆఫీస్ లో పని చేసే ఉద్యోగుల షిఫ్ట్‌ టైమ్‌ అయిపోగానే వారి కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోతాయి. దీంతో ఉద్యోగులు తమ కంప్యూటర్లను వదిలి ఇంటికి వెళ్లాల్సిందే. కాదని అక్కడే కూర్చుని, ఓవర్ టైమ్ చేస్తామన్నా కూడా సిస్టమ్ ఆన్ అవదు. ఈ కంపెనీ నిబంధన ప్రకారం ఆఫీస్‌ టైమ్‌ అయ్యేలోపు ఉద్యోగి తన పనిని పూర్తి చేసుకోవాలి. టైం అయిపోయిన పది నిమిషాల తర్వాత కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద షిఫ్ట్ సమయం పూర్తైందని కనిపించి, కంప్యూటర్ దానంతట అదే ఆగిపోతుంది. ఈ వివరాలను కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ కూడా చేయడం గమనార్హం.

ఇది ప్రమోషన్‌ కోసం చేస్తోన్న ప్రకటన కాదని..తమ ఉద్యోగులు వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాల్సెన్స్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమ కంపెనీలో ఇలాంటి నిబంధన తీసుకొస్తే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..