Turkey – India: టర్కీకి స్నేహహస్తం అందిస్తున్న భారత్‌.. కృతజ్ఞతలు చెప్తున్న ఆ దేశ పౌరులు..

ఇండియా అంటే మానవత్వానికి ప్రతిరూపం. సాయమందించాల్సిన సమయంలో తన, పర అనే భేదాలు చూపదు. అందుకే ఇండియా అంటే అంతర్జాతీయంగా ఎంతో గౌరవం.

Turkey - India: టర్కీకి స్నేహహస్తం అందిస్తున్న భారత్‌.. కృతజ్ఞతలు చెప్తున్న ఆ దేశ పౌరులు..
Operation Dost
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 16, 2023 | 10:01 PM

ఇండియా అంటే మానవత్వానికి ప్రతిరూపం. సాయమందించాల్సిన సమయంలో తన, పర అనే భేదాలు చూపదు. అందుకే ఇండియా అంటే అంతర్జాతీయంగా ఎంతో గౌరవం. తాజాగా ఇప్పుడు టర్కీకి ఇండియా అందిస్తున్న సాయం ఆ దేశ వాసుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

కష్టకాలంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడంటారు. భూకంపంతో తల్లడిల్లుతున్న టర్కీ చేసిన వ్యాఖ్య ఇది. ఇండియా తమ నిజమైన స్నేహితుడని ఇండియాలో టర్కీ రాయబారి ట్వీట్‌ చేశారు. దోస్త్‌ అనే మాటకు హిందీలో ఉన్న అర్థమే టర్కిష్‌ భాషలోనూ ఉంది. ఇండియా అందించిన స్నేహహస్తానికి టర్కీ ధన్యవాదాలు తెలిపింది. టర్కీకి సాయమందించేందుకు భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ పేరు ఆపరేషన్‌ దోస్త్‌.

ఈ నెల 6న తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో వచ్చిన భూకంపం, ఆ తర్వాత తొమ్మిది గంటల తర్వాత వచ్చిన మరో భూకంపం టర్కీలోని దక్షిణ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఆ విషయం ప్రపంచానికి తెలిసి ఆ తీవ్రత గుర్తించిన వెంటనే ఇండియా స్పందించింది. టర్కీతో విభేధాలు మర్చిపోయి తక్షణమే సహాయసామగ్రిని తరలిచింది. మానవత్వాన్ని మించింది లేదని మరోసారి నిరూపిస్తూ భూకంపం సంభవించిన 24 గంటల్లోపే ఇండియా నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది, వైద్య బృందాలు, NDRF టీమ్స్‌ టర్కీలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాయి. వసుదైక కుటుంబం అనే భావనను భారత్‌ తన చర్యల ద్వారా వ్యక్తీకరించింది.

ఇవి కూడా చదవండి

కశ్మీర్‌ విషయంలో ఇండియాతో టర్కీ విభేదిస్తోంది. అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను టర్కీ సమర్థిస్తోంది. టర్కీ ప్రస్తుత అధ్యక్షుడు రెసెప్‌ ఎర్డోగాన్‌ భారత్‌ నిజాయితీ గురించి అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దును టర్కీ వ్యతిరేకించింది. గోధుమల కన్‌సైన్‌మెంట్‌ విషయంలోనూ టర్కీ భారత్‌తో విభేదించి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ భారత్‌ అవేవి పట్టించుకోకుండా కష్టకాలంలో మానవత్వాన్ని చాటుకుంది. టర్కీకి సహాయ హస్తం అందించడం ద్వారా ముస్లింలకు భారత్‌ వ్యతిరేకమని అంతర్జాతీయంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది.

టర్కీకి చేరుకున్న వెంటనే NDRF సిబ్బంది అక్కడ గడ్డ కట్టుకునే చలిని ధిక్కరించి రంగంలోకి దిగారు. మరో వైపు మెడికల్‌ సిబ్బంది టర్కీలో దిగిన వెంటనే 30 బెడ్స్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేసింది. బాధితులకు కావాల్సిన సాయమందించేందుకు అన్ని రకాల సేవలందించే వైద్యులతో పాటు భారత్‌ పంపించిన సహాయ సామగ్రిలో అన్ని ఈక్విప్‌మెంట్స్‌ కూడా ఉన్నాయి. ప్రత్యేక శిక్షణ పొంది 99 మంది వైద్య సిబ్బంది టర్కీలోని ఇస్కెన్‌డెరన్‌ పట్టణంలో వీళ్లు సేవలందిస్తున్నారు. రోజుకు 500 మందికి పైగా రోగులు టర్కీలో ఇండియా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నారు. ఎక్స్‌రే మెషీన్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌, కార్డియాక్‌ మానిటర్లు సహ ఆస్పత్రికి కావాల్సిన పూర్తి సామగ్రిని ఇండియన్‌ ఆర్మీ టర్కీకి తీసుకెళ్లింది. అంతే కాదు, అక్కడ సిబ్బందికి అటు ఇటు తరలించడానికి అవసరమైన టక్కులు కూడా IAF విమానంలో టర్కీకి చేరాయి. అంతే కాదు ఇండియా నుంచి వెళ్లిన అనేక స్నిఫర్‌ డాగ్స్‌ నిరంతరం పనిచేస్తూ భవనాల కింద చిక్కుకుపోయిన వారు ఎందరినో రక్షించాయి.

ప్రకృతి విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బాధితులను ఎలా కాపాడాలనే దానిపై శిక్షణ పొందిన యోధులు వీళ్లంతా. విభేధాలు పక్కన పెట్టి భారత్‌ అందిస్తున్న సేవలను టర్కీ వాసులు ప్రశంసిస్తున్నారు. ఈ కష్టకాలంలో తమను ఆదుకుంటున్నందుకు థ్యాంక్యు వెరీ మచ్‌ అంటూ ధన్యవాదాలు చెప్తున్నారు.

నాటోలో సభ్య దేశం టర్కీ. ఇండియాతో పోల్చితే NATO దేశాల నుంచి టర్కీకి అందుతున్న సాయం అంతంతే. భారత్‌ తన సిబ్బంది, సైన్యాన్ని టర్కీకి పంపించడమే కాదు భారత్‌ నిత్యం అందిస్తున్న ఏదో సహాయ సామగ్రిని టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు అందుకుంటున్నాయి. ఆహార సామగ్రి, దుప్పట్లు, బిస్కెట్లు, నీళ్లు ఇలా ప్రతీ అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది భారత్‌. తమకు అందిస్తున్న సాయం విషయంలో టర్కీ పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తోంది. టర్కీలో ఇండియా అందిస్తున్న సేవలను మిగితా ప్రపంచం కూడా అభినందిస్తోంది. విభేదాలు ఎన్ని ఉన్నా కష్టకాలంలో కావాల్సింది ఆదుకునే గుణమనే విషయాన్ని టర్కీలో సహాయచర్యల ద్వారా భారత్‌ మరోసారి రుజువు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా