AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కు రూ.కోటి… ఇంతకీ ఏ వెహికిల్ కోసమో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మార్కెట్లోకి వచ్చే సరికొత్త మోడల్ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారో.. ఫ్యాన్సీ నంబర్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమకు కావాల్సిన నంబర్ ను దక్కించుకునేందుకు ఎంత ఖర్చు..

Trending: ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కు రూ.కోటి... ఇంతకీ ఏ వెహికిల్ కోసమో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Scootyblog1
Ganesh Mudavath
|

Updated on: Feb 17, 2023 | 6:38 AM

Share

మార్కెట్లోకి వచ్చే సరికొత్త మోడల్ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారో.. ఫ్యాన్సీ నంబర్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమకు కావాల్సిన నంబర్ ను దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. ప్రజల ఇంట్రెస్ట్ ను అవకాశంగా మలుచుకున్న రవాణాశాఖ.. వీఐపీ నంబర్లంటూ అనేక సంఖ్యల సీరీస్లను అమ్మకానికి ఉంచుతోంది. కానీ, కొన్ని సందర్భాలలో ఒకే సంఖ్య కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. అటువంటి సమయాల్లో ఆఫీసర్లు బిడ్డింగ్(వేలం) ప్రక్రియను చేపడతారు. ఇందులో పాల్గొన్న వారు ఎంత ఖర్చు చేసైనా సరే చివరకు వారికి నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ను దక్కించుకుంటారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఓ స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ సంఖ్య కోసం.. అక్షరాల కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయడం గమనార్హం.

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాకు చెందిన ఓ వాహనదారుడు.. మరో 26 మంది సైతం ఆ సంఖ్యను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. శిమ్లా కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ వేలంలో అత్యధిక ధరకు బిడ్ వేశాడు. HP999999 ఫ్యాన్సీ నంబర్ కు ఏకంగా రూ.కోటి 11 వేలు బిడ్డింగ్ వేశాడు. వీవీఐపీ నంబర్ కోసం 26 మంది ఆసక్తి చూపి వేలంలో పాల్గొన్నారు. వాస్తవానికి దీని రిజర్వ్ ధర రూ.1000గా ఫిక్స్ చేశారు అధికారులు.

Scooty Registration

Scooty Registration

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నంబర్ ను దక్కించుకున్న వ్యక్తి రూ.లక్ష పెట్టి స్కూటీని కొనుగోలు చేస్తే.. దాని రిజిస్ట్రేషన్ నంబర్ కోసం మాత్రం ఏకంగా రూ.కోటికి పైనే బిడ్డింగ్ చేయడం విశేషం. సాధారణంగా రూ.కోట్లు విలువ చేసే కార్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లను పొందుతారు కొందరు. కానీ, స్కూటీ కోసం ఇంత మొత్తంలో బిడ్డింగ్ వేయడాన్ని చూసి అధికారులే షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..