AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ కూరగాయలను పచ్చిగా తింటేనే ప్రయోజనాలు.. వండితే వాటిల్లోని పోషకాలు శూన్యం..!

కొన్ని కూరగాయలని వండటం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయని.. తద్వారా వాటితో ఎటువంటి ప్రయోజనాలు ఉండవని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందువల్ల..

Health Tips: ఈ కూరగాయలను పచ్చిగా తింటేనే ప్రయోజనాలు.. వండితే వాటిల్లోని పోషకాలు శూన్యం..!
vegetables
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 16, 2023 | 9:06 PM

Share

మన శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. వీటిల్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి. అయితే సాధారణంగా మనలో ఎవరైనా కురగాయలను ఎలా తింటారు..? ఉడకబెట్టుకునే కదా..! కానీ కొన్ని కూరగాయలని వండటం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయని.. తద్వారా వాటితో ఎటువంటి ప్రయోజనాలు ఉండవని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందువల్ల ఈ కూరగాయలను పచ్చిగా తినడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏయే కూరగాయలను పచ్చిగా తినాలో.. అలా తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లిపాయ: ఉల్లిపాయ అనేది ప్రతి ఇంట్లో ఉపయోగించే సాధరణమైన వెజిటెబుల్. దీనిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పెద్దలు ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని’ అంటుండేవారు. వెజిటబుల్ గ్రేవీ తయారీలో ఎక్కువగా వాడే ఉల్లిపాయను.. పచ్చిగా తింటేనే మంచిది. దీనిని సలాడ్ రూపంలో తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

బీట్‌రూట్: బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని పచ్చిగా తింటే అధిక ప్రయోజనాలు లభిస్తాయి. పచ్చి బీట్‌రూట్ తినడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరం కూడా శక్తితో నిండి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టమాటా: టమోటాని అన్ని కూరలలో వాడుతారు. కానీ నిజంగా టమోటాలోని పోషకాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దానిని సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే టమాటాలను వండిన తర్వాత అందులోని పోషకాలు పూర్తిగా నశిస్తాయి. అందుకే పచ్చిగా తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

బ్రోకలీ: బ్రోకలీ ఆరోగ్యకరమైన, ఇంకా పోషకాలతో కూడిన కూరగాయలలో ఒకటి. దీనిని సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల అధిక మేలు జరుగుతుంది. కానీ దీన్ని ఉడికించాలనుకుంటే కొంచెం ఉప్పును మాత్రమే వాడాలి. దీనిలోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందాలంటే.. బ్రోకలీని కచ్చితంగా పచ్చిగా తినడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.