AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravanasura: ‘రావణాసుర’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ‘ప్యార్ లోన పాగల్’ అంటున్న మాస్ మహారాజ..

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలుతో దూసుకెళ్తున్నాడు. మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కించేలా.. తనదైన..

Ravanasura: ‘రావణాసుర’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ‘ప్యార్ లోన పాగల్’ అంటున్న మాస్ మహారాజ..
Pyaar Lona Paaga Song Promo From Ravanasura Movie
శివలీల గోపి తుల్వా
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 16, 2023 | 6:17 PM

Share

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలుతో దూసుకెళ్తున్నాడు. మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కించేలా.. తనదైన దారిలో వెళ్తూ డిఫరెంట్ రోల్స్ చేస్తూ పూనకాలు తెప్పిస్తున్నాడు. రీసెంట్‌గా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో అలరించిన రవితేజ.. ధమాకా రూపంలో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్‌లో తన తదుపరి సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు ఈ మాస్ హీరో. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాకు ‘స్వామిరారా..’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ అలాగే దక్ష నగర్కర్ లు ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇక ఒకవైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు యమ స్పీడుగా ప్రమోషన్స్ చేపడుతున్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు(ఫిబ్రవరి 16) సినిమాలోని సెకండ్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘ప్యార్ లోన పాగల్..’ అంటూ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ట్యూన్ తో సాగిపోతున్న ఈ పాటలో రవితేజ డాన్స్ మూమెంట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ ప్రోమో వైరల్ అయింది.

ప్యార్‌ లోన పాగల్ సాంగ్ ప్రోమోను ఇక్కడ చూడండి.. 

ఇవి కూడా చదవండి

కాగా, త్వర త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రవితేజ చేతిలో ఈ రావణాసుర సినిమాతో పాటు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కూడా ఉంది. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ సినిమా రాబోతోంది. 1970ల నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని గెటప్‌లో రవితేజ కనిపించనున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో తన మార్కెట్‌ను మళ్లీ పెంచుకున్న ఈ మాస్ మహారాజ్ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో ఎలాంటి హిట్స్ రాబడతాడనేది వేచి చూడాలి..!

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..