Tollywood: కొంటె నవ్వుతో కవ్వించే ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఈమెకు తెలుగులో పిచ్చ ఫాలోయింగ్ బాస్..
టాలీవుడ్‌లో ఆమె నటించింది కేవలం ఒకే ఒక్క సినిమా.. కానీ ఆమెకున్న ఫాలోయింగ్ మాత్రం పీక్స్.. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఓ ట్రెండ్ సెట్టర్.. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా, భారీ కలెక్షన్లు రాబట్టింది.
టాలీవుడ్‌లో ఆమె నటించింది కేవలం ఒకే ఒక్క సినిమా.. కానీ ఆమెకున్న ఫాలోయింగ్ మాత్రం పీక్స్.. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఓ ట్రెండ్ సెట్టర్.. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా, భారీ కలెక్షన్లు రాబట్టింది. అందం, అభినయంతో మన తెలుగింటి అమ్మాయి లాగా.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ తెగ ఆకట్టుకుంది. చేసింది.. తెలుగు సినిమా అయినా.. వాస్తవానికి ఆమె బాలీవుడ్ భామ.. తన సినీ కెరీర్ ను బుల్లితెర నుంచి ప్రారంభించిన ఆమె.. వెండితెరలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? లేకపోతే మీకు ఓ చిన్న క్లూ ఇమ్మంటారా..? మీరు ఇంకా గుర్తించలేకపోతే.. ఇదిగో క్లూ.. తెలుగు ప్రేక్షకులకు ఆమె సీతగా గుర్తింపు పొందింది.
ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్.. మహారాష్ట్రలోని ధూలేలో జన్మించిన మృణాల్.. కాలేజీ రోజుల్లోనే బుల్లితెరపై అడుగుపెట్టింది. సీరియల్స్ ద్వార మచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2014లో మరాఠీ సినిమా ‘విట్టి దండు’ తో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. తన నటనతో అందర్ని ఆకట్టుకుంది. అనంతరం పలు చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే, 2018లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ ‘సూపర్ 30’లో హృతిక్ రోషన్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘ధమాకా’, ‘జెర్సీ’ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించింది.
View this post on Instagram
అలాగే, 2022లో తెలుగులో విడుదలైన ‘సీతారామం’ మృణాల్ ఠాకూర్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. తెలుగుతోపాటు.. అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా మృణాల్ కు దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ప్రముఖలతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. కాగా, బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు హిందీలో 5 చిత్రాలు, తెలుగులో నాని సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ‘సీత’గా దగ్గరైన ఈ అమ్మడుకు ప్రస్తుతం కుర్రకారులో పిచ్చ ఫాలోయింగ్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం..