Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో మేం అధికారికంలో వస్తే.. ‘రూ. 500కే గ్యాస్ సిలిండర్’..

‘‘మేం అధికారంలోకి వస్తే.. ఐదు వందలకే సిలిండర్’’. అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డి బంపరాఫర్ ప్రకటించారు. అయితే కండీషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది

Telangana: తెలంగాణలో మేం అధికారికంలో వస్తే.. 'రూ. 500కే గ్యాస్ సిలిండర్'..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2023 | 8:58 PM

‘‘మేం అధికారంలోకి వస్తే.. ఐదు వందలకే సిలిండర్’’. అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డి బంపరాఫర్ ప్రకటించారు. అయితే కండీషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం మణుగూరు సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన కీలకమైన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎందరో అక్కలున్నారు. ఒక మిర్చీ బండి దగ్గరకెళ్లి ఆ అక్కను తాను సిలిండర్ ధరల గురించి వాకబు చేశాననీ. అలా అన్ని వర్గాలకు చెందిన అక్కలను తాను అడగ్గా.. వారి నుంచి తనకొచ్చిన సమాధానం ఒక్కటేనంటూ తెలిపిన రేవంత్ కీలక హామీనిచ్చారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటంటే.. తాము పవర్ లోకి వస్తే.. మీ పెట్రోల్ కష్టాలు తీరుతాయ్. మేం గద్దెనెక్కితే.. మీకు గ్యాస్ సిలిండర్ సమస్యలు సమసిపోతాయి. ఇప్పటికి మీరు 1200 రూపాయలను ఖర్చు చేస్తే గానీ సిలిండర్ని ఇంటికి తేలేక పోతున్నారు. అదే మేంగానీ అధికారంలోకి వస్తే.. ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం. దీనివల్ల ఒకటీ రెండు కాదు ఏకంగా ఏడు వందల రూపాయలు మిగులుతాయి. మా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో.. ఇక్కడా అలాంటి ధరల్లోనే మీ ఇంటికి సిలిండర్ చేర్చే బాధ్యత మాది.. అంటూ.. హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి..

ఇపుడీ హామీ కారణంగా.. స్థానిక మహిళల మధ్యే కాదు. ఇంటింటా సిలిండర్ ధరల పై చర్చ నడుస్తోంది. అయితే, ఇందులో కండీషన్ ఏంటంటే.. కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఈ హామీ అమలవుతుందని రేవంత్ చెప్పకనే చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..