Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: అయ్యో దేవుడా.. ఏడడుగులు వేస్తుండగా వరుడికి గుండెపోటు.. పాపం చివరకు..

మృత్యువు ఏ రూపంలో వస్తుందో మనం అంచనా వేయలేం.. అప్పటివరకు ఆనందోత్సాహంతో మన మధ్య ఉన్నవారే.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా.. ఎన్నో ఆశలతో ఓ యువకుడు పెళ్లికి సిద్ధమయ్యాడు.

Wedding: అయ్యో దేవుడా.. ఏడడుగులు వేస్తుండగా వరుడికి గుండెపోటు.. పాపం చివరకు..
Wedding
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2023 | 8:34 AM

మృత్యువు ఏ రూపంలో వస్తుందో మనం అంచనా వేయలేం.. అప్పటివరకు ఆనందోత్సాహంతో మన మధ్య ఉన్నవారే.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా.. ఎన్నో ఆశలతో ఓ యువకుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. బంధువులతో బరాత్ నడుమ యువతి ఇంటికి సైతం చేరుకున్నాడు. ఈ క్రమంలో వివాహ తంతు జరుగుతుండగానే గుండెపోటుతో కన్నుమూశాడు.. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్‌లోని రాణిఖేత్‌లో వివాహ సమయంలో వరుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. హల్ద్వానీ నందపుర్‌ కఠ్‌గరియాకు చెందిన సమీర్‌ ఉపాధ్యాయ్‌ (30) అనే యువకుడు దంత వైద్యుడు. ఈ క్రమంలో రాణిఖేత్‌ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం వివాహం కాగా.. కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య వరుడిని ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం పురోహితులు వివాహ తంతు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వధూవరులతో ఏడడుగులు వేయిస్తుండగా సమీర్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాక్‌ అరెస్టుతో సమీర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

వరుడు ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో కుప్పకూలాడని బంధవులు తెలిపారు. పెళ్లి సమయంలో జరిగిన ఈ సంఘటన విని అందరూ షాక్ అవుతున్నారు. మొదట వరుడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో పెద్దాసుపత్రికి తరలిస్తుండగా వరుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..