- Telugu News Photo Gallery Business photos EPFO subscribers alert Beware of this Provident Fund account fraud and fake message
EPFO Alert: ఉద్యోగులకు అలెర్ట్.. పీఎఫ్ ఖాతాలపై సైబర్ నేరస్థుల కన్ను.. ఇలాంటి పొరపాట్లు చేస్తే డబ్బులు గోవిందా..
భారతదేశంలో ఆన్‌లైన్ మోసాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల బ్యాంకు ఖాతాల్లో పడి ఉన్న డబ్బును దోచుకునేందుకు దుండగులు ఎప్పటికప్పుడూ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
Updated on: Feb 13, 2023 | 8:28 PM

భారతదేశంలో ఆన్‌లైన్ మోసాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల బ్యాంకు ఖాతాల్లో పడి ఉన్న డబ్బును దోచుకునేందుకు దుండగులు ఎప్పటికప్పుడూ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. చాలా మంది వారి ఉచ్చులో పడి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. అయితే, సైబర్ నేరగాళ్లు ఇప్పుడు EPFO సబ్‌స్క్రైబర్ల ఖాతాలపై కన్నేశారు.

ఈ పీఎఫ్ ఖాతాల్లోకి చొరబడి నగదు కాజేసేందుకు ప్లాన్ వేస్తున్నట్లు సైబర్ పోలీసులు తెలిపారు. దీనికోసం ఫేక్ మెస్సెజ్ లతో చందాదారులను ఖాతాల్లోని నగదును కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అలెర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

EPFO ద్వారా ఖాతా బదిలీ అభ్యర్థనను రద్దు చేసినట్లు నకిలీ సందేశం (EPFO ఫేక్ మెసేజ్) పంపడం ద్వారా.. వారు తమ ఉద్దేశాలను అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

చాలా మంది వినియోగదారులు అలాంటి సందేశాలను అందుకున్నారు. దీని తర్వాత, కొంతమంది వ్యక్తులు ఈపీఎఫ్‌ఓ చందాదారులను ట్విట్టర్‌లో షేర్ చేయడం ద్వారా అందరినీ హెచ్చరిస్తున్నారు. ఈ ఫోర్జరీని అరికట్టడానికి ప్రభుత్వం, EPFO కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ స్తున్నారు.

అయితే, ఈ రోజుల్లో వ్యక్తిగత సమాచారం, డబ్బును దొంగిలించడానికి నకిలీ సందేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేయడానికి ఇది సులభమైన, అత్యంత ప్రజాదరణ పొందిన మార్గంగా మారిందని పేర్కొంటున్నారు.

తపన్ కుమార్ మొహంతి అనే ట్విట్టర్ యూజర్ @tmohanty1105 హ్యాండిల్‌లో ఓ ట్వీట్‌ను పంచుకున్నారు. ఇందులో మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ కూడా ఇచ్చాడు. BT-EPFOHO చిరునామా నుంచి ఈ సందేశం ఇలా ఉంది, “మీ ఆన్‌లైన్ బదిలీ దావా (WBCAL230250001688) EPFO ద్వారా 10-2-2023న తిరస్కరించబడింది. తిరస్కరణకు కారణాన్ని తెలుసుకోవడానికి లింక్‌పై క్లిక్ చేయండి.. అని ఉంది... ఈ సందేశం నకిలీది. ఎందుకంటే EPFO తన వినియోగదారులకు ఏదైనా లింక్‌పై క్లిక్ చేయమని సందేశం పంపదు.

ఇలాంటి ఫేక్ లింకులపై క్లిక్ చేస్తే వారి ఖాతాల్లోని నగదు మాయం అవుతుంది. కావున ఇలాంటి ఫేక్ మెస్సెజ్ లతో అలెర్ట్ గా ఉండాలని.. వాటి లింకులను క్లిక్ చేయవద్దంంటూ ఈపీఎఫ్ఓ అధికారులు పేర్కొంటున్నారు.





























